‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో లక్ష్మీపార్వతి ఎపిసోడ్ ఉంటుందా? లేదా? అనే అనుమానాలు వీగిపోయినట్టే. ఈ కథలో లక్ష్మీపార్వతి పాత్ర కూడా ఉన్నట్టు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. లక్ష్మీపార్వతి పాత్ర కోసం ఓ సీనియర్ కథానాయికని తీసుకోవాలని అనుకున్నారు. ఆ పాత్రకు గానూ ఆమని ఎంపికైందని సమాచారం. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎలా ప్రవేశించింది? పెళ్లి చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులేంటి? అనేది ఈ కథలో చూపిస్తున్నార్ట. ఇందుకు సంబంధించి లక్ష్మీపార్వతిని చిత్రబృందం కలిసిందా? లేదంటే, తెలిసిన సమాచారం మేరకే ఆ సన్నివేశాల్ని తీర్చిదిద్దుతున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. లక్ష్మీపార్వతి ఎపిసోడ్ అనే కాదు, ఎన్టీఆర్ జీవిత చక్రంలో కీలకమైన ఘట్టాలన్నీ ఈ సినిమాలో ఉంటాయని, కాకపోతే… అవసరమైన మేరకే వాటిని చూపిస్తారని, ఒకవేళ ఇప్పటి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే అంశాలేమైనా ఉంటే, వాటిని చెప్పీ చెప్పకుండా.. ‘పాస్’ ఆన్ చేస్తారని తెలుస్తోంది.