హైదరాబాద్: మత అసహనంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. కొన్ని సంవత్సరాలుగా ఇన్క్రెడిబుల్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఆమిర్ ఖాన్‌ను ఆ కాంట్రాక్ట్ నుంచి తప్పించారు. అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందునే ఈ కాంట్రాక్ట్ రద్దు చేశారన్న వాదనను కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కొట్టి పారేసింది. కాంట్రాక్ట్ ముగిసినందునే ఆయనను తొలగించామని వివరణ ఇచ్చింది. అతిథి దేవోభవ క్యాంపెయిన్‌కోసం తాము మెక్ క్యాన్ ఏజెన్సీతో తాము కాంట్రాక్ట్ కుదుర్చుకున్నామని, ఆ ఏజెన్సీ ఆమిర్ సేవలను వినియోగించుకుందని కేంద్ర పర్యాటకశాఖమంత్రి మహేష్ శర్మ చెప్పారు. ఆ ఏజెన్సీతో తమ కాంట్రాక్ట్ ముగిసిపోయిందని, ఆమిర్‌ను తాము కుదుర్చుకోలేదని తెలిపారు. ఆ ఏజెన్సీతో కాంట్రాక్ట్ ముగిసిపోయింది కాబట్టి ఆమిర్ ఆ క్యాంపెయిన్‌లో ఉండబోరని చెప్పారు. ఆమిర్ చేసిన ఆ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా అతనిపై నిరసనలు వెల్లువవటం తెలిసిందే.