బాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరైన ఆమిర్ ఖాన్ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ‘లాల్ సింగ్ చద్దాతో ప్రేక్షకులను పలకరించారు అమీర్. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. అయితే ఇప్పుడాయన షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఒక ఏడాదిన్నర పాటు కెమారాల ముందుకు రాకూడదని నిర్ణయించుకున్నారు.
‘‘35 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నా. ఇన్ని ఏళ్లలో ఏదో నష్టపోయానని అనిపిస్తోంది.ఇన్నేళ్లు నిరంతరం పని గురించే ఆలోచించాను. అది సరైంది కాదనిపిస్తోంది. అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకోవాలనుకుంటున్నాను. మా అమ్మ, పిల్లలతో గడపాలనుకుంటున్నా. అందుకే ఏడాదిన్నర పాటు కెమెరా ముందుకు రాకూడదని అనుకుంటున్నా’’ అంటూ తన షాకింగ్ నిర్ణయాన్ని చెప్పారు అమీర్. ఒక నటుడికి నటనలోనే విశ్రాంతి దొరుకుతుందని చాలాసార్లు అనేవారు అమీర్. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా బ్రేక్ తీసుకోవడం టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచింది.