ప్రణాళిక అనుకుంటారో, పిసినారి తనం అనుకుంటారో తెలీదు గానీ.. కొన్ని సందర్భాల్లో సినిమాని అతి తక్కువ రేటులో చుట్టేసే అవకాశం వస్తుంది. కొన్ని కథలు పెట్టుబడిని బాగా డిమాండ్ చేస్తాయి. కొన్ని కథలు చేయవు. అలాంటి కథల్ని ఎంచుకోవడం, రిస్కు లేకుండా సినిమాలు తీసుకోవడం కూడా ఆర్టే. ‘ఆట గదరా శివ’ మేకింగ్ గురించి విన్నా.. అదే మాట వినిపిస్తుంది. చంద్రసిద్దార్థ్ దర్శకత్వం వహించిన చిత్రమిది. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత. ఆయనేమో భారీ సినిమాల్ని తీసిన వ్యక్తి. చంద్ర సిద్దార్థ్ పై ‘ఫీల్ గుడ్’ అనే ముద్ర ఉంది కాబట్టి… కనీసం ఈ సినిమాకి రూ.2 నుంచి రూ.3 కోట్ల పెట్టుబడి పెట్టొచ్చు. ‘ఆట గదరా శివ’ సినిమా మాత్రం కేవలం రూ.85 లక్షల్లో ముగించార్ట. ఇదో రోడ్ మూవీ. లొకేషన్లు చాలా తక్కువ. వర్కింగ్ డేస్ కూడా అంతే. అందుకే చాలా తక్కువలో తీసేసే ఛాన్స్ వచ్చింది. రాక్ లైన్ లాంటి నిర్మాత, రజనీకాంత్‌తో… సల్మాన్ ఖాన్‌తో సినిమాలు తీసిన నిర్మాత ఇంత తక్కువలో సినిమా తీస్తాడని ఎవ్వరూ ఊహించరు. ప్రమోషన్లు, రీమేక్ రైట్స్ అన్నీ కలుపుకుంటే 1.25 కోట్లలో సినిమా పూర్తయిపోవొచ్చు. అంటే ఈ సినిమాకి మంచి టాక్ వచ్చి, శాటిలైట్ అమ్ముడుపోయినా… అంతకంత అందుకోవొచ్చు. ఇంతకంటే సేఫ్ సినిమా ఎక్కడుంటుంది..??