రాష్ట్ర ప్రభుత్వం వేసిన సస్పెన్షన్ వేటును తొలగించాలంటూ.. ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను.. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ కొట్టి వేసింది. రాష్ట్ర ప్రభుత్వం వద్దే అప్పీల్ చేసుకోవాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద అప్పీల్ చేసుకున్నా.. ఆయనకు ఊరట దక్కే అవకాశం లేదు.. ఎందుకంటే.. ఆయన రాష్ట్ర ప్రభుత్వమే తనపై కుట్ర చేసిందని ఆరోపిస్తున్నారు. దీంతో.. డీజీ హోదాలో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌లో ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. తాను ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్నప్పుడు.. కొన్ని నిఘా పరికరాల కొనుగోలు విషయంలో అవినీతికి పాల్పడ్డారని.. కీలకమైన సమాచారన్ని బయటకు పంపారని.. ఇలా ఐదు రకాల ఆరోపణలకే.. ఏపీ సర్కార్ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. దీనపై ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు.
రాష్ట్ర ప్రభుత్వం.. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై.. కేంద్రానికి సమాచారం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా.. ధృవీకరణ లేఖను పంపింది. వచ్చే నెల ఏడో తేదీలోపు ఆయనపై చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదే లేఖను.. రాష్ట్ర ప్రభుత్వం క్యాట్‌లో సమర్పించింది. కేంద్రానికి తాము నివేదించామని వారు కూడా.. సస్పెన్షన్ వేటును ఆమోదం తెలిపారని.. గుర్తు చేసింది. అయితే.. దీన్ని పరిగణనలోకి తీసుకోవద్దని.. ఏబీ వెంకటేశ్వరరావు కూడా పిటిషన్ వేశారు. కానీ క్యాట్.. ఏబీ పిటిషన్‌ను కొట్టి వేసింది. సస్పెన్షన్ ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ.. మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం వద్దే అప్పీలు చేసుకోవాలని సూచించింది.
ప్రభుత్వం మారినప్పటి నుండి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ లేదు. ఆయన ఖాళీగా ఉన్నారు. జీతం కూడా ఇవ్వడం లేదని ఆయన క్యాట్‌కు తెలిపారు. జీతం ఇస్తామని.. ప్రభుత్వ న్యాయవాది క్యాట్‌కు తెలిపారు. కేంద్రం సూచించిన దాని ప్రకారం.. ఏబీ వెంకటేశ్వరరావుపై నమోదు చేసిన అభియోగాలపై… ఏప్రిల్ ఏడో తేదీలోగా.. చార్జిషీటు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ లోపు దాఖలు చేయకపోతే.. ఏబీ వెంకటేశ్వరరావు మళ్లీ క్యాట్‌ను ఆశ్రయించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.