సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావుపై ఏపీ సర్కార్ నమోదు చేసిన అభియోగాలపై రోజువారీ విచారణ జరుగుతోంది. అయితే మొదట్లో ప్రభుత్వం ప్రచారం చేసిన అభియోగాలకు..ఇప్పుడు చేస్తున్న అభియోగాలకు పొంతన లేదు. ఈ అంశంపై ఏబీవీ వెంకటేశ్వరరావు చాలా సీరియస్‌గా… తన ఐపీఎస్ అనుభవాన్నంతా ఉపయోగించి… ప్రభుత్వాన్ని ఫిక్స్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ ముందు రోజువారీ విచారణకు హాజరవుతున్న ఆయన.. ఒక్కొక్కటిగా కూపీ లాగుతున్నారు. తనపై జరిగిన ప్రచారం.. చేసిన వాదనలు .. ఇలా ప్రతీ అంశాన్ని పక్కాగా ఆధారాలతో సహా కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ ముందు పెడుతున్నారు. ప్రధానంగా ఆయన తనపై చేసినతప్పుడు ప్రచారంపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది.
ఏబీవీపై ఐదు అభియోగాలతో గత ఏడాది ఫిబ్రవరి ఎనిమిదో తేదీన సీపీఆర్వో శ్రీహరి నుంచి ఓ లెటర్ సర్క్యూలేట్ అయింది. సస్పెన్షన్ ఆర్డర్స్‌కు అదనంగా ఆ లెటర్ అధికారికంగా సీపీఆర్వో శ్రీహరి మీడియా ప్రతినిధులకు పంపారు. అందులో ఐదు ప్రధానమైన అభియోగాలు ఉన్నాయి. ఇందులో మొదటిది గ్రాస్ మిస్ కండక్ట్. క్రిటికల్ ఇంటలిజెన్స్ అండ్ సర్వైలెన్స్ కాంట్రాక్ట్‌ను ఓ ఇజ్రాయెల్ కంపెనీతో కుమ్మక్కయి.. అక్రమమంగా తన కుమారుడికి చెందిన కంపెనీకి ఇప్పించుకున్నారనేది మొదటి అభియోగం. ఇది నేరుగా విదేశీ రక్షణ తయారీ సంస్థతో నేరుగా సంబంధాలు పెట్టుకోవడమేనని.. ఇది సర్వీస్ ఎథికల్ కోడ్‌ను ఉల్లంఘించడమేనని ప్రభుత్వం చెబుతోంది. రెండో అభియోగం .. ఏబీ వెంకటేశ్వరరావు చర్యల వల్ల దేశానికి , రాష్ట్రానికి ముప్పు ఏర్పడటం. ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావు.. కీలకమైన సమాచారాన్ని ఇజ్రాయెలీ కంపెనీలకు పంచుకున్నారని.. ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇంటలిజెన్స్ ప్రోటోకాల్స్ అండ్ ప్రొసీజర్స్ ఉద్దేశపూర్వకంగా వెల్లడించారని సీపీఆర్వో తన నోట్లో పేర్కొన్నారు. అలాగే ఎక్విప్ మెంట్‌ను కూడా సబ్ స్టాండర్డ్‌వి కొన్నారని .. స్టేట్ సీక్రెట్స్‌ను యాక్సెస్ చేశారని… దాని వల్ల లాభం పొందారని కూడా ఆరోపణ . మూడో అభియోగం.. టెండర్లలో అక్రమాలకు పాల్పడటం, నాలుగో అభియోగం.., మొత్తం వ్యవహారంలో ఎన్నో ఇర్రెగ్యులారిటీస్ ఉండటం.. ఐదో అభియోగంగా.. సీనియర్ ఆఫీసర్లపై అమర్యాదగా ప్రవర్తించడాన్ని పేర్కొన్నారు. వీటిని నిరూపించాల్సిన పరిస్థితి ఇప్పుడు సీపీఆర్వో శ్రీహరిపై పడినట్లుగా కనిపిస్తోంది.
ఏబీవీ వెకంటేశ్వరరావు విచారణలో కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ సిసోడియాకు ఇదే విషయాన్నిచెప్పారు. సీపీఆర్వోను పిలిపించి ప్రశ్నించాలని అడిగారు. ఈ మేరకు సీపీఆర్వో శ్రీహరికి సమాచరం పంపితే.. ఆయన విచారణకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని ఏబీవీ అనుకోవడం లేదు. సీనియర్ ఐపీఎస్ అయిన తనపై.. దేశద్రోహం లాంటి ఆరోపణలు చేసిన వ్యక్తుల్ని వదిలి పెట్టకూడదన్న పట్టుదలతో ఉన్నారు. ఈ కేసు విషయంలో తనపై జరిగిన దుష్ప్రచారం.. చేసిన అభియోగాలు..దానికి కారకులైన వారిని చట్టం ముందు పెట్టాలన్న లక్ష్యంతో ఆయన పని చేస్తున్నారు.
1989 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఏబీ వెంటటేశ్వరరావు ప్రస్తుతం డీజీపీ ర్యాంక్‌లో ఉన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఏబీవీపై ప్రభుత్వం చేసిన అభియోగాలను నిరూపించాల్సిన పరిస్థితిలో పడింది. సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టింది. నిరూపించలేకపోతే.. ఆ తదుపరి ఏబీవీ తన చర్యలు తాను తీసుకుంటారు. సివిల్ సర్వీస్ అధికారుల హక్కులను డీవోపీటీ ఎప్పటికప్పుడు పరిరక్షిస్తుంది.చట్టపరంగా తనకున్న ఆప్షన్స్ ద్వారా సీపీఆర్వో శ్రీహరిని చట్టపరంగా శిక్షించడానికి ఏబీవీ పట్టుదలతో ఉన్నారని అంటున్నారు. మొత్తానికి ఈ ఎపిసోడ్లో శ్రీహరిని బలి పశువు అవబోతున్నారని… ప్రభుత్వం.. ఐపీఎస్.. సివిల్ సర్వీస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.