వైసీపీ అధినేత జగన్ రెడ్డి కుట్రలకు ఐదేళ్ల పాటు నరకం అనుభవించిన సీనియర్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఆయనపై గత ప్రభుత్వం చార్జ్ చేసిన అభియోగాల్లో ఒక్క ఆధారం లేదని తేలడంతో వాటిని ఉపసంహరించుకుంటున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. మరొక్క అభియోగాన్ని ఉపసంహరించుకునే ఫైల్ ముఖ్యమంత్రి వద్ద ఉంది.
2014-19 మధ్య ఏబీ వెంకటేశ్వరరావు కీలక పోస్టుల్లో పని చేశారు. అందులో ఇంటలిజెన్స్ చీఫ్ పోస్టు ఒకటి. జగన్ రెడ్డి తన కష్టాలన్నింటికీ ఇంటలిజెన్స్ చీఫే కారణం అనుకున్నారు. జగన్ రెడ్డి గెలిచిన తరవాత ఆయనకు పోస్టింగులు ఇవ్వలేదు. ఆరు నెలల తర్వాత సస్పెండ్ చేశారు. ఇందు కోసం అసలు జరగని కొనుగోళ్లపై కేసులు పెట్టారు. జగన్ రెడ్డి సీపీఆర్వో శ్రీహరితో దేశద్రోహం ఆరోపణలు మీడియాకు సర్క్యూలేట్ చేయించారు. క్యాట్ నుంచి సుప్రీంకోర్టు వరకూ ఒక్క ఆధారం కూడా ఎక్కడా ప్రొడ్యూస్ చేయలేదు.
అన్ని న్యాయస్థానాలు ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట ఇవ్వడంతో పోస్టింగ్ ఇవ్వాల్సి వచ్చింది. రిటైరయ్యే రోజు వరకూ సస్పెన్షన్ ఎత్తివేయలేదు. ఇక సీఎస్ తనకు గండంగా మారుతుదంని రిటైర్మెంట్ రోజు పోస్టింగ్ ఇచ్చారు. ఐదేళ్ల సర్వీసు కోల్పోయిన ఏబీవీ… చివరికి గౌరవంగా రిటైరయ్యారు. ఇప్పుడు ఆయన కేసులు తేలిపోతున్నాయి. ఏబీ వెంకటేశ్వరరావుపై కుట్ర చేసిన వారిలో ఐఏఎస్, ఐపీఎస్లు కూడా ఉన్నారు. చాలా మంది వైసీపీ గవర్నమెంట్ రాగానే కనిపించకుండా పోయారు. వారిలో సవాంగ్ ఒకరు.