ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎన్టీఆర్ జనతా గ్యారేజీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఎన్టీఆర్.. షూటింగ్ హడావుడిలో ఉండగా అక్కడకు ఓ స్పెషల్ గెస్ట్ వచ్చాడు. తనని చూడగానే సెట్టంతా ఆనందోత్సాహాలతో మునిగిపోయింది. షూటింగ్ ఆపేసి మరీ.. ఆ గెస్ట్ చుట్టూ చేరిపోయారు. ఎన్టీఆర్ అయితే… తన పనులన్నీ వదిలేసి ఆ గెస్ట్‌తో ఆట పాటలతో పడిపోయాడు.
ఇంతకీ ఆ గెస్ట్ ఎవరో తెలుసా?? ఎన్టీఆర్ ముద్దుల కొడుకు.. అభయ్. అవును.. జనతా గ్యారేజీ సెట్‌కి అతిథిగా వచ్చింది అభయే.
అభయ్ రాకతో సెట్లో కొత్త ఉత్సాహం వచ్చింది. తనయుడితో కాసేపు ఆడుకొని ఆ ఫొటోల్ని ఎన్టీఆర్ తన ట్విట్టర్లో పెట్టాడు. ‘జనతా గ్యారేజ్ సెట్‌కి తొలి సారి వచ్చాడు అభయ్’ అంటూ ఆనందాన్ని అభిమానులతో పంచుకొన్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.