తేజ సినిమాలంటే.. ప్రేమకథలే గుర్తొస్తాయి. కొత్తవాళ్లతో ఎప్పుడూ ప్రేమకథలే తీశాడు తేజ. దగ్గుబాటి ఇంటి నుంచి వస్తున్న కొత్త హీరో అభిరామ్ ని తేజ సినిమాతో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనగానే.. ఇది కూడా మరో లవ్ స్టోరీ ఏమో అనుకున్నారంతా. అయితే.. తేజ ఈసారి రూటు మార్చాడు. అభిరామ్ కోసం యాక్షన్ కథని రెడీ చేశాడట. సురేష్ బాబు కూడా ఇప్పుడు ఆ కథని ఓకే చేసేశాడు.
తేజ స్కూల్ సెపరేటుగా ఉంటుంది. స్క్రిప్టు లాక్ చేసి, అప్పుడు షూటింగ్ మొదలెట్టడం ఉండదు. రాస్తూ.. రాసింది తీస్తూ పోవడమే. కానీ..సురేష్ బాబు స్కూల్ వేరు. స్క్రిప్టు లాక్ చేశాకే షూటింగ్. పైగా తనయుడి సినిమా కదా..? ఏమాత్రం రిస్కు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. అందుకే సురేష్ బాబు కోసం.. తేజ తన పద్ధతి మార్చాడు. మొదటి సార్.. పూర్తి స్థాయి స్క్రిప్టు సిద్ధం చేసి, బౌండెండ్ స్క్రిప్టు సురేష్ బాబు చేతిలో పెట్టాడు. అదిప్పుడు ఓకే అయిపోయింది. నిజానికి తేజ `చిత్రం 1.1` కథని రెడీ చేసి, దాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. అంతలో అభిరామ్ ప్రాజెక్టు వచ్చింది. అభిరామ్ కోసం `చిత్రం 1.1`ని ప్రస్తుతానికి పక్కన పెట్టేశాడు తేజ.