దగ్గుబాటి వారసుడు అభిరామ్ కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి `అహింస` అని టైటిల్ పెట్టారు. ఈ సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్నీ చిత్రబృందం గోప్యంగా ఉంచుతోంది. ఈ సినిమాలో అభిరామ్ లుక్ కూడా ఇప్పటి వరకూ బయటకు రాలేదు. మరోవైపు షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈ పాటికి సినిమా పూర్తయ్యేదే. కానీ.. అభిరామ్ వైఖరి వల్ల.. ఈ షూటింగ్ ఆలస్యం అవుతోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ లో అభిరామ్ కాలు బెణికింది. మరుసటి రోజుకి నయం అయిపోయే గాయమే అది. కానీ ఆ పేరు చెప్పి అభిరామ్ షూటింగ్ కి డుమ్మా కొడుతున్నాడని, మరో వారం రోజులు కాల్షీట్లు ఇస్తే, షూటింగ్ పూర్తయిపోతుందని, కానీ అభిరామ్ సహకరించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. సాధారణంగా తేజతో పనిచేయడానికి నటీనటులంతా భయపడిపోతుంటారు. ఆయన సెట్లో చాలా స్ట్రిక్ట్. ఆయనే అందరికీ చుక్కలు చూపిస్తోంటే, ఆయనకే… అభి ఇలా షాకివ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి అభి సెట్ కి వచ్చేదెప్పుడో, సినిమా పూర్తయ్యేదెప్పుడో..?