అబ్దుల్ కలామ్ బయోపిక్ ఇటీవల ఢిల్లీలో శ్రీకారం చుట్టుకుంది. కలాం పాత్రలో అలీ నటించనున్నారు. మార్టినీ ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. ఢిల్లీలో ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో వివాదం నెలకొంది. అబ్దుల్ కలాం బయోపిక్ రైట్స్ తమ వద్ద ఉన్నాయని మరెవరూ ఈ కథని సినిమాగా తీయలేరని, ఒకవేళ అలాంటి ప్రయత్నాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ హెచ్చరించారు. డాక్టర్ కలాం జీవితంపై ఏ భాషలోనైనా సినిమా లేదా డాక్యుమెంటరీని నిర్మించే, పోస్టర్లను రిలీజ్ చేసే అధికారిక హక్కులను తాము కలిగివున్నామని, కలాంకు సంబంధించి ఏ రూపంలోనైనా రిఫరెన్సులు తీసుకొనే చర్యలకు వేరెవరు పూనుకున్నా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
‘డాక్టర్ అబ్దుల్ కలాం..` అనే పేరుతో అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. యేడాది క్రితమే అబ్దుల్ కలామ్ కుటుంబ సభ్యులని సంప్రదించి, బయోపిక్‌కి సంబంధించిన అన్ని హక్కుల్నీ తీసుకుంది. ఇప్పుడు అలీ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలిసి – అభిషేక్ పిక్చర్స్ తమ అభ్యంతరాల్ని తెలుపుతోంది. మరి అలీ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.