అనతికాలంలోనే సినిమా డిస్ట్రిబ్యూటర్ రంగంలో ట్రెండ్ సెట్ చేస్తున్న అభిషేక్ పిక్చర్స్ వారు మరో అడుగు ముందుకేసి సినిమా నిర్మాణంలోకి కూడా అడుగులేస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలను కూడా అత్యంత భారీ మొత్తంలో ఏరియా హక్కులను సొంతం చేసుకుని లాభాలు ఘడిస్తున్న అభిషేక్ పిక్చర్స్ వారు ఇప్పుడు సొంత నిర్మాణ సంస్థగా ఏర్పడటం మంచి విషయం అని చెప్పొచ్చు.
కేవలం సంవత్సర కాలంలోనే డిస్ట్రిబ్యూటర్ రంగంలో తమ స్టామినా ఏంటో చూపించిన అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేయడం పరిశ్రమకు కూడా ఎంతో మంచి జరుగనున్నది. సూపర్ స్టార్ మహేష్ శ్రీమంతుడు, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నాన్నకు ప్రేమతో ఇలా ట్రెండ్ సెట్ సినిమాలను రిలీజ్ చేసిన ఈ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఇటీవల రిలీజ్ అయిన నాని కృష్ణగాడి వీర ప్రేమ గాథని కూడా గ్రాండ్ గా రిలీజ్ చేసి సక్సెస్ సాధించింది.
అభిషేక్ పిక్చర్స్ బలం అంతా నైజాంలోనే.. నైజాంలో ఇప్పటివరకు సత్తా చాటిన దిల్ రాజుకి అభిషేక్ పిక్చర్స్ తలనొప్పిలా మారింది. మొన్నటిదాకా డిస్ట్రిబ్యూషన్ లోనే ఉన్న వీరు ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారంటే ఇక వరుసెంట భారీ సినిమాలతో ట్రెండ్ సెట్ చేయడం ఖాయం అన్నట్టే. మరి డిస్ట్రిబ్యూటర్ గా విజయ పథంలో దూసుకెళ్తున్న అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మాణ సంస్థగా కూడా సూపర్ సక్సెస్ లు అందుకోవాలని కోరుకుందాం.