ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ… ఇక నుంచి బీజేపీకి మద్దతుగా మారబోతున్నారన్న ప్రచారం మీడియా సర్కిల్స్‌లో వినిపిస్తోంది. శనివారం రోజు.. ఆర్కే ఇంటికి కేంద్ర మంత్రి దర్మేంధ్ర ప్రధాన్ వెళ్లారు. గంటకుపైగా మాట్లాడారు. ఆయన వచ్చింది.. పార్టీ తరపున పెట్టుకున్న కార్యక్రమానికే. సంపర్క్ అభియాన్ అనే పేరుతో.. దేశంలోని ప్రముఖుల్ని కేంద్రమంత్రులు కలిసి… కశ్మీర్లో ఆర్టికల్ 370 నిర్ణయం తీసుకోవడానికి కారణాలను వివరించి మద్దతు అడుగుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో బీజేపీ ఎంచుకున్న ముగ్గురు ప్రముఖుల్లో వేమూరి రాధాకృష్ణ ఒకరు. దీంతోనే రాజకీయవర్గాల్లో ఓ రకమైన ఆసక్తి ఏర్పడింది. గతంలో అమిత్ షా.. ఎన్నికలకు ముందు సంపర్క్ ఫర్ సమర్థన్ పేరుతో కార్యక్రమం పెట్టి… హైదరాబాద్ వచ్చినప్పుడు… రవిప్రకాష్, రామోజీరావులను కలిశారు. ఇప్పుడు ఏబీఎన్ రాధాకృష్ణను కేంద్రమంత్రి కలిశారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు… విభిన్న వాతావరణం నెలకొంది. తెలంగాణ బీజేపీకి ఓ ఫోర్స్ గా ఎదిగే అవకాశం కళ్ల ముందు కనిపిస్తోంది. ఈ క్రమంలో.. ఆ పార్టీకీ మీడియా మద్దతు కరవైంది. ఆ లోటను ఆంధ్రజ్యోతి పూరించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కు.. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఆప్తమిత్రుడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే.. రాజకీయాల పరంగా.. వచ్చే సరికి.. రాధాకృష్ణను కూడా.. కేసీఆర్ టార్గెట్ చేశారు. గతంలో.. టీవీ9 ఏదో అన్నదని… ఏబీఎన్ ను కలిపి బ్యాన్ చేశారు. ఆ తర్వాత సంబంధాలు మెరుగుపడినా… అవకాశం వస్తే.. రాధాకృష్ణ.. కేసీఆర్ కు తన ప్రభావం ఏమిటో చూపించకుండా ఉండే ప్రయత్నం చేయరని భావిస్తున్నారు.
అదే సమయంలో.. ఏపీలో అధికార పార్టీ… ఆంధ్రజ్యోతిని ఇబ్బందులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే చానల్ ను.. బ్యాన చేశారు. అనధికారికంగా… కేబుల్ ఆపరేటర్లను బెదిరించి.. చానల్ నిలుపుదల చేయడంతో… ఓ అధికార మద్దతుతోనే… దీన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం మారగానే… నిబంధనల ప్రకారం.. ఆంధ్రజ్యోతికి ఇవ్వాల్సిన ప్రకటనలు కూడా… ఏపీ సర్కార్ ఇవ్వడం లేదు. ఈ క్రమంలో.. కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉండాలని.. రాధాకృష్ణ అనుకోవడంలో… విశేషం ఏమీ లేదు. అందుకే ముందు ముందు… తెలంగాణలో బీజేపీకి హార్డ్ కోర్ సపోర్ట్ గా… ఆంధ్రజ్యోతి మారినా ఆశ్చర్యం లేదనే భావన మీడియా వర్గాల్లో ప్రారంభమయింది.