ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వారాంతపు స్పెషల్ కొత్త పలుకులో… మీడియాపై అణచివేత కోసం జగన్ తెచ్చిన జీవోను.. రామచంద్రమూర్తి సమర్థించడాన్ని .. తప్పుపట్టారు. దీనిపై.. నొచ్చుకున్న రామచంద్రమూర్తి.. వేమూరి రాధాకృష్ణకు సుదీర్ఘమైన లేఖ రాశారు. రాధాకృష్ణ తన వ్యాసంలో… అప్పట్లో వైఎస్ తెచ్చిన జీవోకు వ్యతిరేకంగా..కటువగా.. ఓ ఆర్టికల్ రాశారని.. చెప్పుకొచ్చారు. దీనికి రామచంద్రమూర్తి వివరణ ఇచ్చారు. అది తాను రాసింది కాదని ప్రకటించేశారు. తన భాష, శైలి అలా ఉండవని.. సాక్ష్యంగా చెప్పుకొచ్చారు. అదే సమయంలో.. ప్రెస్‌కౌన్సిల్‌కు.. తాను ఫిర్యాదు చేసింది.. సాక్షికి ప్రకటనలు ఇవ్వనందుకేనని.. రామచంద్రమూర్తి తన ఆక్షేపణ లేఖలో.. రాశారు. దీనికి.. రాధాకృష్ణ వెంటనే కౌంటర్ ఇచ్చారు. మరి ఇప్పుడు.. ఆంధ్రజ్యోతికి ఎందుకు ప్రకటనలు నిలిపివేశారని.. పరోక్షంగా ప్రశ్నించారు. తాను ఈ విషయాన్ని రామచంద్రమూర్తిని అడగబోనన్నారు.
రామచంద్రమూర్తి రాసిన లేఖను.. పూర్తిగా.. ప్రచురించిన ఆంధ్రజ్యోతి యాజమాన్యం.. ఆర్కే రిప్లైకూ.. అదే కాలంలో చోటిచ్చింది. అయితే.. రామచంద్రమూర్తి… కన్నా.. తక్కువ ప్లేసే కేటాయించారు. రామచంద్ర మూర్తి అభిప్రాయాలకే..ఎక్కువ స్థలం కేటాయించారు. ఆయన వ్యక్తం చేసిన ప్రతీ అభిప్రాయానికి… రాధాకృష్ణ సమాధానం ఇచ్చారు. అంతే కాదు.. గతంలో.. ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా ఉంటూ.. రహస్యంగా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని రామచంద్రమూర్తి కలిసిన విషయాన్ని రాధాకృష్ణ బయటపెట్టారు. ప్రభుత్వంపై తీవ్రంగా పోరాడుతున్న సమయంలో… అలా వెళ్లి కలవాల్సిన అవసరం కానీ.. కలిసిన తర్వాత కానీ… ముందు కానీ.. తనకు కనీస సమాచారం ఇవ్వకపోవడాన్ని.. రాధాకృష్ణ ప్రశ్నించారు.
జర్నలిజంలో ఇద్దరూ ఉద్దండులే. ఒకరు.. ఎడిటర్ గా పేరు ప్రఖ్యాతులు పొంది.. ప్రభుత్వ సలహాదారుగా మారిపోయారు. మరొకరు.. సొంత పత్రిక పెట్టి… యజమానిగా మారారు. ఒకరిపై .. ఒకరు.. వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేసుకోవడంతోనే వివాదం ప్రారంభమయింది. తను చేసిన విమర్శలకు స్పందించిన రామచంద్రమూర్తి వాదనకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆంధ్రజ్యోతి విధానం మెచ్చుకోదగినదే. దానికి రాధాకృష్ణ కూడా కౌంటర్ ఇస్తున్నారు. వీరి సంవాదం వల్ల.. చరిత్రలో బయటకు తెలియని చాలా విషయాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.