జగన్ రెడ్డి రాజకీయ అధికారాన్ని తప్పులు చేయడానికి ఉపయోగించుకుంటే.. చంద్రబాబు తన అధికారంతో తప్పు చేసిన జగన్ రెడ్డిని నిండా ముంచుతున్నారు. చంద్రబాబు రాజకీయానికి.. జగన్ రాజకీయానికి ఇక్కడే బోలెడంతో తేడా ఉందని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ విశ్లేషించారు. నాలుగు నెలల పాటు పెద్దగా చర్యలు తీసుకోకుండా ఉండటం చేతకాక కాదని కానీ ఒక్క సారే కొట్టే దెబ్బతో జగన్ రెడ్డికి కోలుకోలేని నష్టం జరగాలని ఓపిక పట్టాలని ఆర్కే తేల్చారు. ఇప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత రాదు.. వైసీపీ క్యాడర్ కకావికలం అవుతుంది. కోలుకోవడం అంత తేలిక కాదనేది ఆర్కే విశ్లేషణలోని సారాంశం.
పనిలో పనిగా జగన్ రెడ్డి వికృత మనస్థత్వానికి వీలైనంత ఎక్కువగా సర్టిఫికెట్లు జారీ చేశారు. సొంత తల్లి, చెల్లిని అత్యంత దారుణంగా తిట్టిస్తున్న వైనాన్ని కూడా వివరించారు. నర్రా రవీంద్రారెడ్డి భారతీ రెడ్డి అనధికారిక పీఏనని విజయమ్మ, షర్మిల,సునీతపై అతను అత్యంత ఘోరంగా పోస్టులు పెడుతున్నా భారతి నిలువరించలేదంటే.. అది ఆమె కనుసన్నల్లో జరిగిన వ్యవహరమేనని స్పష్టమవుతోందని ఆర్కే అంటున్నారు. అంటే కావాలనే పెట్టించారని ఆర్కే తేల్చారు. ఇప్పుడు వర్రా కోసం అవినాష్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు చూస్తే .. అతని వెనుక ఖచ్చితంగా అందరూ ఉన్నారని.. వారి ఆదేశాలతోనే పోస్టులు పెట్టి ఉంటారని ఎవరైనా అనుకుంటారు. ఆర్కే కూడా అదే అభిప్రాయాన్ని కల్పించేందుకు ప్రయత్నించారు.
పనిలో పనిగా జగన్ రెడ్డి ప్రెస్మీట్లో తన పేరు ఎత్తడంతో తన వాదన వినిపించడానికి .. ఎదురుదాడి చేయడానికి ఇంత కన్నా మంచి అవకాశం ఉండదని ఆర్కే అనుకున్నారు. జగన్ రెడ్డికి స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారో కానీ అందులో అందులో ఆంధ్రజ్యోతి రాయని కథనం గురించి ప్రస్తావించారు. వర్రాను పోలీసుల నుంచి తప్పించడం వెనుక భారతిరెడ్డి ఉందని రాసినట్లుగా జగన్ చెప్పుకొచ్చారు. కానీ అవినాష్ రెడ్డి గురించి మాత్రమే భారతి రాసిది. దీంతో ఆర్కే జగన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. అబద్దాల బతుకు అనేశారు. ఫేక్ ప్రచారం చేసిన జగన్ రెడ్డి బొక్కలోకి పోవడానికి రెడీనా అని సవాల్ కూడా చేశారు.
జగన్ రెడ్డి కాలకేయ సైన్యానికి అత్యంత గడ్డు రోజులు వచ్చాయని.. ఆర్కే చెప్పకనే చెప్పారు. ఆయనకు తల్లి, చెల్లి అనే సెంటిమెంట్ కూడా ఉండదని.. ఆయనో నర రూప్ రాక్షసుడని బ్రాండ్ రెడీ చేశారు. జగన్ రెడ్డి చేస్తున్న పనులే దీనికి సాక్ష్యంగా చూపిస్తున్నారు. మొత్తంగా ఆర్కే… తానేదో ఫేక్ న్యూస్ వేశానని జగన్ రెడ్డి ఫేక్ ప్రచారం చేయడంతో వచ్చిన కోపాన్ని ఆర్కే తన ఆర్టికల్ ద్వారా పూర్తిగా తీర్చుకున్నారు.