ఏపీ పీసీసీ చీఫ్ పదవికి షర్మిల పేరును ప్రకటించారు. అయితే ఇది ఇప్పుడు జరిగింది. కానీ గత మేలోనే షర్మిల రాజకీయంగా తెలంగాణలో తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్న సమయంలోనే ఆర్కే .. కాబోయే ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అని తన కొత్త పలుకులో ప్రకటించారు. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టబోతున్నారని కూడా ఆయనే అందరికీ ముందు చెప్పారు. ఎవరూ నమ్మలేదు. ఆయనపైనే సెటైర్లు వేశారు. కానీ తర్వాత అది నిజమైంది. షర్మిల విషయంలో.. వైఎస్ కుటుంబంలో ఏం జరుగుతుందో ఆయన ఎప్పటికప్పుడు నేరుగా చెబుతున్నారు లేదా హింట్ ఇస్తున్నారు.
షర్మిల రాజకీయ ఆడుగులపైనా ఆయన ముందుగానే అంచనాలు వేస్తూ వస్తున్నారు. గత మే నెలలో … షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి.. తెలంగాణలో పోటీ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఆమె కాంగ్రెస్ లో తన పార్టీ విలీనం అనే ప్రతిపాదన తెస్తే కాంగ్రెస్ హైకమాండ్ లో వచ్చిన ఆలోచన ఏపీ మాత్రమే. ఇదే విషయాన్ని షర్మిలకు చెప్పారు. తెలంగాణలో తేల్చుకున్న తర్వాత ఏపీ సంగతి చూడాలనుకున్నారు. తెలంగాణలో పోటీ చేస్తే వచ్చే ఫలితాలతో ఏపీని కామెడీ చేస్తారని ఆమె ప్లాన్డ్ గా ఆగిపోయారు. తనకు అంతో ఇంతో బలం కనిపించే ఏపీలోనే రాజకీయం చేయాలని డిసైడయ్యారు.
షర్మిల విషయంలో ఆర్కే చెబుతున్నవన్నీ నిజం అవుతున్నాయి. అందుకే.. షర్మిలకు రాజకీయ సలహాదారుగా ఆర్కే ఉన్నారన్న సెటైర్లు కూడా వినిపిస్తూ ఉంటాయి. అదే నిజమైతే..షర్మిలముందు ముందు తన సోదరుడు జగన్ రెడ్డికి అనేక క్లిష్టమైన సమస్యలు తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయి.