సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించినట్లుగా … ఆర్కే జగన్ రెడ్డి చెల్లెళ్లు షర్మిల, సునీతలకు సలహాదారుగా వ్యవహరిస్తున్నారో లేదో కానీ.. షర్మిలకు ఆయన ఇచ్చిన సలహా కాంగ్రెస్ లోచేరి రాజకీయం చేయడమేనని తేలిపోయింది. ఈ వారం కొత్తపలుకు ఆర్టికల్ లో ఆర్కే… షర్మిల రాజకీయ భవిష్యత్ పై దిశానిర్దేశం చేశారు. షర్మిల తెలంగాణలో రాజకీయం చేసుకుంటే.. పరువు పోతుందని… పాలేరులో ఓడిపోతే ఏపీలోనూ రాజకీయ భవిష్యత్ ఉండదని అందుకే నేరుగా ఏపీలో రాజీకయం చేయాలని నేరుగానే తన ఆర్టికల్ ద్వారా సలహా ఇచ్చేశారు. అయితే ఆర్కే.. తనదైన మార్క్ లో చెప్పారు . షర్మిల నిర్ణయం తీసేసుకున్నారని అంటున్నారు.
షర్మిల నిజానికి ఏపీ వైపు చూడకూడదని అనుకున్నారట.. కానీ జగన్ రెడ్డి వేధింపులతో…ఆమె మనసు మార్చుకున్నారని.. ఇ క అన్న లేడు.. గిన్న లేడు.. రాజశేఖర్ రెడ్డి పుత్రిక మాత్రమే ఫైనల్ అని.. ఆమె రంగంలోకి దిగబోతున్నారని అంటున్నారు. ఆస్తులు పంచకపోవడమే కాదు.. తన వ్యాపారాలను దెబ్బకొట్టడం… చివరికి గన్ మెన్లను కూడా తొలగించడంతో షర్మిల రగిలిపోతున్నారట. ఇప్పటికే వైఎస్ఆర్టీపీ నడవకుండా… ఫండ్స్ రాకుండా చేస్తున్నారన్న వేదన ఉంది. దీంతో.. జగన్ రెడ్డితో ఢీ కొట్టాలని డిసైడయ్యారని ఆర్కే చెబుతున్నారు. తామందరి రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చి తమనే వేధిస్తున్న జగన్ రెడ్డికి తామంతా కలిసి గర్వభంగం చేస్తామని షర్మిల ప్రతిన బూనారని ఆర్కే పరోక్షంగా చెబుతున్నారు.
పరోక్షంగా ఆర్కే కొత్తపలుకులో కాంగ్రెస్ కు భవిష్యత్ రాజకీయం చెప్పే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా జగన్ రెడ్డి దగ్గరే ఉందని.. జగన్ రెడ్డి బలహీన పడితేనే వారంతా మళ్లీ కాంగ్రెస్ కు వస్తారన్నట్లుగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డి ఓడిపోతే… అవినీతి కేసులలో రక్షించేందుకు.. బాబాయ్ హత్య కేసులో కాపాడేందుకు బీజేపీ కూడా అంగీకరించదని ఆర్కే విశ్లేషణ. మొత్తంగా జగన్ రెడ్డి ఎలా బలహీనపడితే అలా షర్మిల ఓటు బ్యాంక్ తెస్తుందని విశదీకరించారు.
షర్మిల విషయంలో ఆర్కే నిజంగా సలహాదారుగా ఉన్నారో లేదో కానీ.. ఆయన చెప్పిన విషయాలు మాత్రం మొదటి నుంచి నిజమవుతూనే ఉన్నాయి. షర్మిల ఏపీలో రాజకీయాలు చేయకపోతే.. అన్నా చెల్లెళ్లు ఇద్దరూ కలిసి ఆడుతున్న డ్రామానే ఎక్కువ మంది భావిస్తారు. నిజంగా విబేధాలుంటే.. షర్మిల ఏపీలో రాజకీయం స్టార్ట్ చేస్తారని.. ఆర్కే చెప్పకనే చెబుతున్నారు. కానీ ప్రస్తుతం.. షర్మిలతో ఉన్న సుహృద్భావ వాతవరణం మధ్య ఇలాంటి భాషను మాత్రం వాడటం లేదు.