ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ చాలా రోజుల తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్పై కాకుండా తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టి తన వారాంతపు ఆర్టికల్ “కొత్తపలుకు” రాశారు., హుజురాబాద్ ఉపఎన్నికల విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఆయన విచక్షణ కోల్పోయారనడానికి రుజువులని ఆయన అంటున్నారు. ఈటలను ఓడించాలన్న లక్ష్యంతో తానేం చేస్తున్నారో సోయి మర్చిపోయినంతగా పరిస్థితి మారిపోయిందనే అర్థం లో రాసుకొచ్చారు. కేసీఆర్ ఇప్పుడు తన నెత్తి మీద తాను చెయ్యి పెట్టుకున్నారని.. దళిత బంధు పథకం ద్వారా దళితులందరికీ న్యాయం చేయలేకపోగా.. మిగతా అన్ని వర్గాలు దూరం అయ్యే దుస్థితి వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఈటలను ఓడించాలన్న లక్ష్యంతో కేసీఆర్ గుడ్డిగా ముందుకెళ్తూ ఇబ్బందులు పడబోతున్నారని ఆర్కే.. తన ఆర్టికల్ సారాంశాన్ని తేటతెల్లం చేశారు.
కేసీఆర్ దళిత బంధు పథకంపై మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిగా ఉన్నారని ఆర్కే చెప్పుకొచ్చారు. అది నిజం కూడా. ఎందుకంటే క్షేత్ర స్థాయిలో దళితుల నుంచి ఇతర వర్గాల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొనేదివారే్. ఇప్పటికే ఉపఎన్నికలు వస్తే పెద్ద ఎత్తున లబ్ది చేకూరుతుందన్న అభిప్రాయం ప్రజల్లో పెరిగిపోవడంతో పలు చోట్ల ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలే వీటిని చేయిస్తున్నప్పటికీ.. సామాన్య వర్గాల్లోనూ ఇది నిజమే కదా అన్న అభిప్రాయం బలపడుతోంది. అందుకే.. ఎమ్మెల్యేలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఈ విషయం కేసీఆర్ వరకూ తెలిసిందో లేదో కానీ ఆర్కే మాత్రంతన ఆర్టికల్ ద్వారా స్పష్టమైన సమాచారాన్నే ఇచ్చారు.
రాజకీయ లబ్ది కోసం తెలంగాణనూ అప్పుల కుంపటి చేయడానికి సిద్దపడిపోయారని ఆర్కే చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి బాటలోనే పెద్ద ఎత్తున అప్పులు చేసి.. ప్రజలకు పంచి పెట్టాలని నిర్ణయించుకున్నారని అంతిమంగా అది చేటు చేస్తుందని చెబుతున్నారు. ఇస్తూ పోతే ప్రజల కోరికలకు అంతు ఉండదు. ఇవ్వడం ప్రారంభించిన తర్వాత వారి ఇవ్వడం ఆపేస్తే ఆ అసంతృప్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఇంత చేసినా గెలవకపోతే.. అది ఆయనకు తర్వాతి ఎన్నికల్లో పరాజయానికి మొదటి మెట్టుగా ఆర్కే తేల్చేశారు. పనిలో పనిగా హుజూరాబాద్ ఉపఎన్నికలు ఇప్పుడల్లా జరిగే అవకాశం లేదని కూడా ఆర్కే తేల్చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని సీఎం పదవి నుంచి దించడమే లక్ష్యంగా ఉపఎన్నికలు ఆలస్యం చేయాలని అమిత్ షా నిర్ణయించుకున్నారని ఆర్కే అంటున్నారు.
ఏపీకి సంబంధించిన అంశాలనూ తన ఆర్టికల్లో ఆర్కే పొందు పరిచారు. అయితే అక్కడ రాజకీయం గురించి కాకుండా… వైఎస్ వివేకా కుమార్తె సునీత భద్రత అంశంపై స్పందించారు. సీఎం జగన్పై కుటుంబం నమ్మకం కోల్పయిందన్న కోణంలో కొంత అభిప్రాయాన్ని వ్యక్తం చే్శారు