ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కూటమి ప్రభుత్వానికి సలహాలివ్వడంలో నెక్ట్స్ లెవల్‌కు చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం మధ్య సమన్వయం లేదని ఆయనే పత్రికలోనే ప్రచారం చేస్తారు. మళ్లీ వారాంతంలో వచ్చి ఆయనే సమన్వయం సాధించాలంటే ఏం చేయాలో సలహాలిస్తారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో తప్పు ఎక్కడ జరిగిందన్న దాని కంటే.. అసలు టీటీడీ బోర్డు చైర్మన్, ఏవో మధ్య సఖ్యత లేదని ముఖ్యమంత్రి ముందే వాదులాడుకున్నారని.. చంద్రబాబు ముందే ఇలా చేశారని.. చంద్రబాబు పట్టు కోల్పోయారని ప్రచారం చేయడం ప్రారంభించారు. ఇప్పుడు వీకెండ్ లో అలాంటివి ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలో సలహాలిచ్చారు.
ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిగా కలిసి దుర్ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లాలని అప్పుడే సమన్వయం ఉన్నట్లుగా అని ఆర్కే చెబుతున్నారు. పవన్ కల్యాణ్ కూడా.. అధికారులు సారీ చెప్పాలని కోరారని.. అది మంచిదేనని… అయితే చంద్రబాబు సమక్షంలో చేయాలని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎవరికి వారు ప్రకటనలు చేయడం వల్ల.. సమన్వయం లేదని అనుకుంటారని ఆర్కే బాధపడ్డారు. కానీ వైసీపీ నేతలు మాత్రం.. ఇలా ఇద్దరూ వేర్వేరుగా రావడం వల్ల జగన్ పర్యటన ఫ్లాప్ అయిందని.. పవన్ కల్యాణ్ ను సాయంత్రం ఉద్దేశపూర్వకంగా పరామర్శకు పంపారని ప్రెస్ మీట్ పెట్టి మీర ఏడ్చారు. అది వారి రాజకీయ వ్యూహం అని ఎందుకు అనుకోకూడదు. జగన్ రెడ్డి చేసే శవరాజకీయాలకు కౌంటర్ ఇవ్వాలని ఆర్కే కూడా ఇంతకు ముందు చాలా సార్లు చెప్పారు. అలాంటిదే ఎందుకు కాకూడదు.
ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే తాను రాజకీయ పండితుడినని ఎప్పటికప్పుడు నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. రాజకీయాల్లో ఎవరూ పండితులు ఉండరు. ఎవరు విశ్లేషణలు చేసినా.. తేలిపోయే పరిస్థితి ఉంటుంది. కూటమి ప్రభుత్వాన్ని ఎలా నడుపుకోవాలన్నది .. ఆయా నేతలు డిసైడ్ చేసుకుంటారు. ప్రతి అడుగునూ విశ్లేషించి.. ఇలా చేస్తే ప్రజలు మీ మధ్య సమన్వయం లేదని అనుకుంటారని అంటే..కష్టమే. పవన్ కల్యాణ్ వర్కింగ్ స్టైల్ ను అర్థం చేసుకునే సరికి సమయం పడుతుంది. చంద్రబాబు వర్కింగ్ స్టైల్ వేరే. ఆయనను జగన్ రెడ్డిలా పని చేయాలని.. పవన్ కల్యాణ్ ను మారాలని సలహాలివ్వడం ఆయనకే చెల్లింది.
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆంధ్రజ్యోతి కథనాలు చూస్తే.. చంద్రబాబును, పవన్ ను డిక్టేట్ చేయాలనుకున్నట్లుగా ఉంటుంది. కింది స్థాయిలో తమకు నచ్చని అధికారులకు ఏదైనా పోస్టింగ్ వచ్చినా వైసీపీ హయాంలోనూ ఉద్యోగం చేశాడు కదా అతనికి ఎలా పోస్టింగ్ ఇచ్చారన్నట్లుగా రాయడం ప్రారంభించారు. అది పై స్థాయి వరకూ వెళ్లింది. అందరూ వైసీపీ హయాంలోని ఉద్యోగులే. వీరే అంతకు ముందు టీడీపీ హయాంలోనూ పని చేశారు. ఇప్పుడు కూటమి పార్టీల మధ్య అలాంటి పోలికలతో సలహాలు ఇస్తున్నారు. ఆర్కే… టీడీపీకి ప్రియమైన శత్రువు అనుకోవచ్చు.