విజయసాయిరెడ్డితో వ్యక్తిగతంగా కూడా వైరం ఉన్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఇప్పుడు విజయగర్వంతో ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయసాయిరెడ్డి తనకు తాను ఓడిపోయినట్లుగా రాజకీయ సన్యాసం ప్రకటించుకోవడం ఆయనను చాలా సంతోషపరిచింది. ఈ క్రమంలో అసలేం జరిగిందో వివరించారు. విజయసాయిరెడ్డి చాలా రోజుల నుంచి బీజేపీలో చేరడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. టీడీపీ నుంచి ఎన్వోసీ తెచ్చుకుంటేనే చేర్చుకుంటామని బీజేపీ నేతలు చెప్పారట. దాని కోసం ప్రయత్నించి విఫలమయ్యారని ఆర్కే చెబుతున్నారు. చివరికి విధి లేక పరిస్థితుల్లో రాజీనామా చేశారని అంటున్నారు.
అయితే జగన్ రెడ్డితో అవమానాలు ఆయనకు మొదటి నుంచి ఉంటే.. ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఎందుకు గుడ్ బె చెప్పారనే లాజిక్ కు ఆర్కే మర్చిపోయారు. రాజీనామా చేయడానికి దారి తీసిన పరిస్థితుల్ని ఆయన చెప్పారు. అయితే సిగ్గూ ఎగ్గూ లేని విజయసాయిరెడ్డి తన జీవితం అంతా వైఎస్ కుటుంబం దగ్గర ఎలా ఉంచారో ఆయన చెప్పారు.. కానీ ఇప్పుడు ఎందుకు ఆత్మాభిమానం వచ్చి రాజీనామా చేశారో ఆర్కే విశ్లేషించలేకపోయారు. తెర వెనుక ఏదో గూడుపుఠాణి ఉంటుందని ఆయన అంచనాకు రాలేకపోయారు.
విజయసాయిరెడ్డిని మమతా కులకర్ణితో పోల్చారు ఆర్కే. అదే రోజు కులకర్ణి కూడా కుంభమేళాలో సన్యాసం తీసుకుంది. హీరోయిన్ గా చేసి మాఫియాడాన్ కు పవర్ గా వెళ్లి డ్రగ్స్ కేసుల్లోఇరుక్కుని మమతా కులకర్ణి ఇప్పుడు సన్యాసిగా మారిపోయారు. ఇదిసీజన్ కాబట్టి ఆమె ఆ రూట్ లోకి వెళ్లారు కానీ మరోసారి తన పాత బాటలోకి వెళ్లరని ఏమీ ఉండదు.. ఇదే విషయాన్ని ఆర్కే కూడా చెబుతున్నారు. విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఎప్పుడూ మాట మీద నిలబడలేదు కాబట్టి ఆయన రాజకీయ సన్యాసం అంటే ఇక రాడని అనుకోవడానికి లేదని.. మళ్లీ రావొచ్చని అంటున్నారు.
విజయసాయిరెడ్డి .. తరచూ కలిసేవారని ఆర్కే చెప్పుకున్నారు. గతంలోనూ చెప్పారు. బహుశా తనను టీడీపీలో చేర్చాలని ఆర్కే వద్ద లాబీయింగ్ కోసం వచ్చారేమో. ఆ విషయాన్ని మాత్రం ఆర్కే చెప్పలేదు.