ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ .. న్యాయవ్యవస్థలో ఉన్న పరిస్థితులపై ఈ వారం సుదీర్ఘంగా చర్చించారు. సాధారణంగా ఇలాంటి అంశాలపై విశ్లేషణలు చేయడానికి చాలా మీడియా సంస్థలు జంకుతాయి. వార్తను వార్తగా ఇచ్చి ఊరుకుంటాయి. కానీ రాధాకృష్ణ. న్యాయవ్యవస్థ విశ్వసనీయత తగ్గిపోతున్న అంశంపై విస్తృతంగా చర్చిస్తూ ఈ వారం తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
కొంత మంది న్యాయమూర్తులు తమకు రాజ్యాంగపరంగా ఉన్న రక్షణలను అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడుతున్నారని ఆయన అంటున్నారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ సిన్హా ఇంట్లో నోట్ల కట్ట ల వ్యవహారంపై వ్యవస్థలు స్పందించిన వైనాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. నోట్ల కట్టలు తగలబడిన వ్యవహారంలో వారం రోజుల వరకూ విషయం బయటకు రాకుండా ఎలా ఉందని ఆయన అడిగారు.. ఇదే అంశంపై రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ వ్యక్తం చేసిన ప్రాయాన్ని తన వాదనకు అనుకూలంగా ఆర్కే చేసుకున్నారు.
సుప్రీంకోర్టు కొలీజియానికి న్యాయమూర్తుల్ని నియమించే అధికారం ఉంది కానీ తొలగించే అధికారం మాత్రం లేదు. తొలగించాలంటే అభిశంసన చేపట్టాల్సిందే. ఇప్పటికి ఇద్దరిపై మాత్రమే పార్లమెంట్ అభిశంసన చేపట్టింది. అదే సమయంలో విచారణ పేరుతో ఆలస్యం చేసి అంతా మర్చిపోయేలా చేస్తారన్న అనుమానాలను కూడా ఆర్కే పరోక్షంగా వ్యక్తం చేశారు.
ఇతర విభాగాల్లో ఇలాంటి నోట్ల కట్టల అంశం బయపడితే ఈడీ, ఐటీ హడావుడి చేస్తాయి. మరి ఎందుకు యశ్వంత్ వర్మ విషయంలో చేయలేదన్నది కూడా ఆర్కే ప్రశ్న. కారణం ఏదైనా న్యాయవ్యవస్థపై ప్రజలకు అచంచలమైన విశ్వాసం ఉండాలి.. ఉండేలా వ్యవస్థ తీరు కూడా ఉండాలనేది ఎక్కువ మాట. ఆర్కే కూడా అదే అంటున్నారు.