కేసీఆర్ హైదరాబాద్ చుట్టుపక్కల పూర్తి స్థాయిలో భూదందా చేస్తున్నారట. ప్రభుత్వ భూములను చెరబట్టి.. అవి తమవే అని వాదించేవారు కోర్టుకెళ్లి ఉత్తర్వులు తెచ్చుకుంటే.. ప్రభుత్వం తరపున కనీసం అప్పీల్‌కూ వెళ్లడం లేదని.. అలా ప్రైవేటు పరం చేసి వేల కోట్లు సంపాదించేశారని ఆర్కే చెబుతున్నారు. అంతే కాదు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్‌ను అడ్డం పెట్టుకుని కేసీఆర్ ఎలా సంపాదించారో చెప్పడానికి వారం రోజుల పాటు పేపర్లో సీరియల్‌గా ప్రచురించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇలా ప్రచురిస్తారో లేదో కానీ.. ఆయన మాత్రం.. అసలు మొత్తం కేసీఆర్ భూదందాలకు తన వద్ద సమాచారం ఉందని ఆర్టికల్ ద్వారా స్పష్టం చేసినట్లయింది.
అదే సమయంలో కేసీఆర్ డబ్బుకు ఆశపడేవాళ్లు లేరన్న అభిప్రాయానికీ వచ్చారు. ఆర్థిక సాయం చేస్తామంటే తీసుకుంటూరు కానీ.. కేసీఆర్ వెంట నడవడం మాత్రం సాధ్యం కాదన్న సంకేతాలు ఇస్తున్నారని ఆర్కే చెప్పుకొచ్చారు. కేసీఆర్ విషయంలో ఆర్కే దూకుడుగానే ఉంటారు. తన చానల్ ను బ్యాన్ చేసినా.. తన పత్రికకు రావాల్సిన యాడ్స్ ఆపేసినా ఆర్కే వెనక్కి తగ్గరు ఈ సారి ఇలాంటి ఆరోపణలు చేసిన ఆర్కేపై కేసీఆర్ ఎలాంటి రివెంజ్ తీర్చుకుంటారో చూడాల్సి ఉంది.
ఏపీ రాజకీయాలపై కూడా ఆర్కే కామెంట్ చేశారు కానీ.. అక్కడ జరుగుతున్న రాజకీయాలు ఆయనకు సంతృప్తికరంగా అనిపిస్తున్నట్లుగా ఉన్నాయి. గతంలో జగన్ పనైపోయిందన్న నమ్మకాన్ని కలిగించేందుకు ఎక్కువ ప్రయత్నించేవారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత్ అలాంటి ఎలివేషన్లు ఇవ్వకుండా.. కామ్ గా.. జగన్ కు మరో సారి ఓటు వేయాలనిపిస్తే ఎలాంటిపరిస్థితి ఉంటుందో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.