రాజకీయాల్లో సవాళ్లు ఆసక్తికరంగా ఉంటాయి. ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, పత్రికాధిపతి ఆర్కే మధ్య ఇలాంటి సవాళ్లే చోటు చేసుకున్నాయి. అందరి ముందు చర్చిద్దాం.. ఒకరి జాతకాలు ఒకరం బయట పెట్టుకుందాం అని బహిరంగంగానే సవాళ్లు చేసుకున్నారు. లైవ్ ఇస్తామని..అది అన్ని చానళ్లలో వచ్చేలా కాపీరైట్ కూడా ఫ్రీ చేస్తామని ఆర్కే ప్రకటించారు. దానికి విజయసాయిరెడ్డి కూడా తన కండిషన్స్ చెప్పారు. మీ చానల్లో కాదు.. చాలా మందిని తీసుకొస్తా.. వారి మధ్య డిస్కో పెట్టుకుందామన్నారు. దానికి కూడాఆర్కే ఓకే అన్నారు.
ఎక్కడకు. ..ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా.. వీపు విమానం మోత మోగిస్తారు అని హెచ్చరించారు. విజయసాయిరెడ్డి మాత్రం తాను ఐక్యరాజ్యసమితికి వెళ్తున్నానని వెళ్లొచ్చాక మాట్లాడుకుందామన్నారు. ఆయన ఐక్యరాజ్యసమితి టూర్ కు.. ఈ డిబేట్ కు సంబంధం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. రోజులు గడిచిపోతున్నా ఆయన ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు. కోర్టు పర్మిషన్ ఇచ్చినా ఆయన దేశం దాటలేరు. మరి ఇప్పుడు అయినా డిబేట్ కు సిద్దం కావొచ్చు కదా !
విజయసాయిరెడ్డిపై ఆంధ్రజ్యోతిలో ఎన్ని ఆరోపణలు వస్తాయో లెక్కే లేదు. అలాగే ఆర్కేపై విజయసాయిరెడ్డి అలాగే ఆరోపణలు చేస్తారు. ఇందులో నిజానిజాల్ని వారిద్దరే చర్చలో ప్రజల ముందు పెట్టుకునేలా చాలెంజ్‌లు చేసుకుంటే ఇక సామాన్య ప్రజలు మాత్రం ఈ వినోదాన్ని చూసేందుకు రెడీగా ఉండకుండా ఉంటారా ?. బిగ్ బాస్ మసాలా కంటె ఎక్కువ ఉంటుందని ఎంటర్టెయిన్ మెంట్ ప్రేక్షకులు కూడా రెడీఅవుతారు. మరి ఈ ఇద్దరు ఎందుకు సైలెంట్ అయిపోయారు