ఇద్దరు పెద్ద మనుషులు ఊరు బయట డిబేట్ పెట్టుకుంటే చాలా విషయాలు బయటకు వస్తాయి. మీడియా ముఖ్యుడు వేమూరి రాధాకృష్ణ.. రాజకీయ ప్రముఖుడు విజయసాయిరెడ్డి ఊరి బయట ఢిల్లీలో డిబేట్ పెట్టుకుందామని పరస్పర సవాళ్లు చేసుకున్నారు., విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో.. ఆర్కే తన సొంత మీడియాలో ఈ సవాళ్లు చేసుకున్నారు. విజయసాయిరెడ్డి షరతులు పెడితే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దానికై సై అన్నారు. వీపు విమానం మోత మోగిస్తానని హెచ్చరించారు. దీనికి అంగీకరించిన విజయసాయిరెడ్డి .. తాను ఐక్యరాజ్యసమితి చూసొస్తానని ఆ తర్వతా చూసుకుందామన్నారు.
విజయసాయిరెడ్డి ఐక్యరాజ్య సమితికి పోయి వచ్చాడో లేకపోతే.. లుకౌట్ నోటీసులు ఇచ్చారని ఊరుకున్నాడో కానీ.. ఇక్కడేఉన్నారు. కానీ ఆర్కేతో డిబేట్ కు మాత్రం ఇంకా ముహుర్తం ఖరారు చేయలేదు. ఇద్దరూ .. ఎదుటివారి జాతకాలను బయటపెడతామని సవాల్ చేసి ఉన్నారు కాబట్టి సామాన్య ప్రజలు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఎవరేమిటో అన్నది ఈ డిబేట్లలో తేలే అవకాశం ఉంది., అయితే.. ఆర్కే కూడా ఇప్పుడు సైలెంటుగా గా ఉన్నారు. అప్పట్లో తనపై ఆరోపణలు చేసినప్పుడు సవాల్ చేసిన ఆయన ఇప్పుడు సైలెంటుగా అయిపోయారు. విజయసాయిరెడ్డి తన గురించి ఏమీ మాట్లాడటం లేదని సైలెంటుగా ఉన్నారా లేకపోతే.. ఇంకో కారణం ఏమైనా ఉందా ?
విజయసాయిరెడ్డి వ్యవహారం మొదటినుంచి వివాదాస్పదమే. ఆయన. గురించి బయటపడాల్సినవి చాలా ఉన్నాయి. ఆర్కేవాటిని బయట పెడతారని చాలా మంది అనుకుంటున్నారు. ఆర్కే విషయంలోనూ చాలా పుకార్లు ఉన్నాయి.. వాటిని విజయసాయిరెడ్డి బయటపెడతారా లేదా అన్నది తేలాలి. ఎందుకంటే.. ఆర్కేతో విజయసాయిరెడ్డి పలుమార్లు సమావేశం అయ్యారని బయటకు వచ్చింది. ఈ ఇద్దరూ రాజీ పడిపోతే మరోసారి చాలెంజ్ లు చేసుకుంటే.. సెటిల్మెంట్ కోసం ఏదో జరుగుతోందని జనం అనుకుంటారు.