ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం కొత్త పలుకు ద్వారా వైఎస్ షర్మిలకు జగన్మోహన్ రెడ్డి నుంచి ఆస్తులు ఇప్పించే బాధ్యత తీసుకున్నారు. ఈ మేరకు కొత్తపలుకు ద్వారా సీఎం జగన్కు బహిరంగ రాయబారం పంపంచారు. ముందు చెప్పిన ఆస్తులనా సరే ఇస్తారా లేకపోతే బ్రదర్ అనిల్ .. ఏపీలో క్రైస్తవుల్ని జగన్ కు వ్యతిరేకంగా మార్చేందుకు ప్రయత్నించమంటారా అన్న సంకేతాలు ఈ వారం కొత్త పలుకులో ఉన్నాయి. ఆస్తుల పంపకంలో అసలేం జరిగిందో పూసగుచ్చినట్లుగా వివరించడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి.. ఆర్కే ఓ సందేశం ఇచ్చారు. ఇది తన ప్రతిపాదన కాదని.. నేరుగా షర్మిల నుంచి వస్తుందేనన్నట్లుగా పరోక్షంగా వారికి తేల్చి చెప్పే ప్రయత్నం చేశారు.
జగన్, షర్మిల మధ్య జెరూసలెంలోనే ఆస్తుల పంపకం మధ్య చర్చలు జరిగాయని ఆర్కే చెబుతున్నారు. అలాగే తర్వాత కూడా ఆస్తుల పంపకంపై జగన్ ఓ నిర్ణయానికి వచ్చారని…సరస్వతి సిమెంట్స్ సహా చాలా ఆస్తులు షర్మిలకు ఇచ్చేందుకు అంగీకిరించారట. జగన్ సంతకంకూడా చేసి ఇచ్చారని.. చెబుతున్నారు. కానీ ఇలా ఇస్తామన్నవి కూడా ఇవ్వడం లేదనేది ఆర్కే చెబుతున్నమాట. ఇవైనా ఇవ్వకపోవడంపై షర్మిల, విజయమ్మ మండిపడుతున్నారు. అందుకే ఏపీలో జగన్ కు వ్యతిరేకంగా బ్రదర్ అనిల్ ను రంగంలోకి దించుతున్నారు. అయితే ఇవన్నీ నష్టం చేస్తాయనుకుుంటున్న జగన్.. ఎన్నికలయ్యాక ఆస్తలు ఇస్తానని రాయబారం పంపారట. జగన్ నైజం తెలుసు కాబట్టి వారు నమ్మడం లేదని.. ఇప్పటికిప్పుడు ఆస్తుల్ని పంచివాల్సిందేనని వారంటున్నట్లుగా ఆర్కే చెబుతున్నారు.
ఆర్టికల్ లో భాష నేరుగా ఏది ఉన్నప్పటికీ.. భావం మాత్రం .. షర్మిలకు ఆస్తులివ్వాలని లేకపోతే.. జరిగే పరిణామాలు ఫలానాలా ఉంటాయని.. ఆర్కే జగన్ కు సందేశం పంపించారు. ఇక జగన్ ఇష్టం అన్నట్లుగా ఆయన ముగించారు. అవినాష్ రెడ్డి కేసు, రాజధానుల కేసు విషయంలో న్యాయవ్యవస్థను సైతం ప్రభావితం చేసేందుకు జగన్ సాహసిస్తున్నారని.. ఆ పరిణామాలు ముందు ముందు ఆయనే ఎదుర్కొంటారన్నట్లుగా ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.
ఇదే ఆర్టికల్లో కేసీఆర్కూడా స్ట్రాంగ్ సందేశం పంపారు. కేసీఆర్ చేస్తున్న భూదందాలపై మొత్తం తనకు సమాచారం ఉందని ఆయన పరోక్షంగా చెప్పారు. ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటుపరం అయ్యేలా చేయడంలో ఇద్దరు అధికారులు సహకరిస్తున్నారని వారి పేర్లూ చెప్పారు. ఇలా పేర్లు చెప్పడం.. వారిని కట్టడి చేసే ప్రయత్నమే అనుకోవచ్చు. కేసీఆర్ విషయంలో ఆర్కే మొదటి నుంచి దూకుడుగానే ఉన్నారు. పేపర్ కు యాడ్స్ ఇవ్వకపోయినా పట్టించుకోలేదు.