జగన్‌లా వ్యవహరిస్తే.. ఆయనకు చంద్రబాబుకు తేడా ఏముంటుందని.. అలా వ్యవహరించకూడదనే ప్రజలు తీర్పిచ్చారని రెండు, మూడు వారాల కిందట కొత్త పలుకులు పలికిన ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తాజాగా చంద్రబాబు మారాల్సిందేనని సలహాలిస్తూ.. వచ్చేశారు . అందుకే జగన్మోహన్ రెడ్డి అంటే ఒక అదీ.. ఒక ఇదీ అని ఎలివేషన్లు కూడా ఇవ్వడం ప్రారంభించారు. జగన్ పని అయిపోయిందని టీడీపీ వాళ్లు అనుకుంటున్నట్లుగా.. అలాంటిదేమీ లేదని ఆయన చెప్పుకున్నట్లుగా కూడా రాసుకొచ్చారు.
జగన్‌కు ఓ ప్రత్యామ్నాయం రానంత వరకూ ఆయనకు ఢోకా ఉండదని రాజకీయ పార్టీల నేతలందరికీ తెలుసు. ఆ ప్రత్యామ్నాయం షర్మిల రూపంలో రెడీ అవుతుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఆర్కే దీని గురించి చెప్పకుండా… ఆయన పని అయిపోలేదు.. తప్పుడు ప్రచారాలతో మళ్లీ ఊపందుకుంటున్నారని… చెప్పుకొచ్చారు. గతంలో ఇలా చేస్తే… పోలీసులు నోటీసులతో ఇంటి ముందు ఉండేవారని.. ఇప్పుడు అలా చేయడం లేదని అంటున్నారు. కమ్మ డీఎస్పీల ఉదంతాన్ని ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు హత్యలు జరగకపోయినా జరిగాయని జగన్ చేస్తున్న ప్రచారాన్ని కూడా దానితోనే పోల్చారు. తప్పుడు ప్రచారంలో జగన్ ను ఎదుర్కోవడం కష్టమని.. ఆయనపై త్వరగా చర్యలు తీసుకోవాలన్నట్లుగా చెప్పుకొచ్చారు.
Read Also:పవన్ ని చూసి నేర్చుకో జగన్
పదే పదే చంద్రబాబు సంప్రదాయ రాజకీయాలని కామెంట్ చేస్తున్నారు ఆర్కే. ఆ సంప్రదాయ రాజకీయాలతోనే అత్యంత భారీ విజయాన్ని ఈ సారి సొంతం చేసుకున్నారన్న సంగతిని మాత్రం గుర్తించడానికి ఆయన మనసు రావడం లేదు. తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేసి అదే ఆధునిక రాజకీయమనుకున్న వారు అథంపాతాళానికి పడిపోయారని కూడా గుర్తించలేకపోతున్నారు. ఆర్కేకు రాజకీయ సలహాలివ్వాలన్న ఆత్రుతతో ఇలాంటి కథనాలు రాస్తున్నారు.. నిజాలను ఆయన కూడా గుర్తించలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎలా ఎదుర్కోవాలో.. ఆయన చేసే తప్పుడు ప్రచారాలను ఎలా నియంత్రించాలో చంద్రబాబుకు తెలుసు కానీ ఇలా ప్రతీ వారానికో విరుద్ధమైన సలహాలిస్తూ.. గందరగోళం చేసే ప్రయత్నం చేయడం మాత్రం గొప్పగా ఉండదు.
జగన్ రెడ్డి చేసేది తప్పుడు ప్రచారమే. ఆ విషయం ప్రజలకు అర్థమయ్యేలా చేయడం తప్ప మరో మార్గం లేదు. వారి నోరు మూయించడానికి ప్రయత్నాలు చేస్తే అది రివర్స్ అవుతుందని మన ప్రజాస్వామ్యం అనేక సార్లు నిరూపించింది. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడం… ప్రభుత్వ పనితీరులో స్ఫష్టమైన మార్పు చూపించడమే కీలకం. అలా కాకుండా.. .. జగన్ రెడ్డి విధ్వంసాలు చేస్తారు. శవ రాజకీయాలు చేస్తారు.. ఆయనను కట్టడి చేయలేరు అన్నట్లుగా మాట్లాడితే.. చరిత్ర మర్చిపోయినట్లే అవుతుంది.
రాజకీయాల్లో సంప్రదాయ రాజకీయాలు.. ఆధునికరాజకీయాలు అంటూ ఉండవు. రాజకీయాలు ఎప్పుడూ నిత్యనూతనమే. ప్రజల కేంద్రంగా చేసే రాజకీయాలే వర్కవుట్ అవుతాయి. నేతలు ఎప్పుడూ వారి దయాదాక్షిణ్యాల మీద ఉండాల్సిందే. అందుకే.. వారిని దృష్టిలో పెట్టుకునే రాజకీయాలు చేయాల్సి ఉంటుంది.. ప్రతిపక్ష నేతను కాదు. కానీ ఆర్కే మాత్రం జగన్ ను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు చేయమంటున్నారు.