కోర్టు స్టేతో నెట్టుకు వస్తున్న సాక్షి టీవీ లైసెన్స్ ను రద్దు చేయించేందుకే ఏబీఎన్ యాజమాన్యం వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సాక్షిపై రకరకాల ఆరోపణలతో కేసులు పెట్టిన ఏబీఎన్ తాజాగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు డీటైల్డ్ ఫిర్యాదు చేసింది. నిబంధనలను సాక్షి చానల్ ఎలా ఉల్లంఘిస్తుందో వివరించింది. ఆ చానల్‌కు కేంద్ర హోంశాఖ అనుమతులు కూడా లేవని గతంలో ఇచ్చిన నోటీసుల్ని కూడా ఏబీఎన్ తన ఫిర్యాదులో పేర్కొంది.
సాక్షి చానల్ లైసెన్స్ ను రద్దు చేయాలని గతంలోనే కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. అయితే ఈ మేరకు వచ్చిన నోటీసులను తెలంగాణ హైకోర్టులో సాక్షి చానల్ యాజమాన్యం సవాల్ చేసింది. స్టే తెచ్చుకుంది. స్టే మీద చానల్ ను నడిపేస్తోంది . ఈ లోపు ఏబీఎన్ … సాక్షి చానల్ , మీడియా సంస్థ పై అనేక ఆరోపణలు చేసి కేసులు పెట్టింది. అదే సమయంలో తప్పుడు వార్తల విషయంలో ఏపీలోనూ సాక్షిపై ఓ కేసు నమోదు అయింది. అన్నింటినీ కేంద్ర సమాచార ప్రసారశాఖ దృష్టికి తీసుకెళ్లింది.
ఏబీఎన్ చేసిన ఫిర్యాదు చూస్తూంటే… సాక్షి లైసెన్స్ ను రద్దు చేయించే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లుగా అర్థమవుతుంది. అయితే ఓ చానల్ లైసెన్స్ ను రద్దు చేయించడం అంత తేలిక కాదు. కానీ దేశ రక్షణకు సమస్యగా మారితే మాత్రం వదిలి పెట్టరు. ఇప్పుడు అదే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.