గొర్రె పురాణం ట్రైలర్: మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె

సుహాస్ కథల ఎంపిక బావుంటుంది. తనకి తగ్గ కథలని, కొత్తదనం వున్న పాయింట్లని ఎంచుకొని సినిమాలు చేస్తున్నాడు. ఆయన నుంచి రాబోతున్న మరో సినిమా ‘గొర్రె పురాణం’. బాబీ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

తరుణ్ భాస్కర్ వాయిస్ లో ట్రైలర్ మొదలైయింది. ఇందులో కథలోని పాయింట్ చెప్పారు. ఓ గొర్రె కారణంగా రెండు మతాలు మధ్య చిచ్చు రేగుతుంది. ప్రజలు రెండుగా విడిపోయి ఘర్షణ పడతారు. చివరికి ఆ గొర్రెపై కేసు పెడతారు. ఈ కేసుకి హీరో పాత్రకి ఏమిటి సంబంధం అనేది మిగతా కథ.

పాయింట్ ఆసక్తికరంగానే వుంది. సుహాస్ ఖైదీగా కనిపించాడు. అతని నేపధ్యం గురించి ప్రస్థావించలేదు. తనకేదో బలమైన ఫ్లాష్ బ్యాకే వుంది.’ మనం బ్రతకడానికి గొర్రెని తినేస్తాం. గొర్రె బ్రతకడానికి మనల్ని చంపేస్తే ఎందుకు తన ఆత్మరక్షణగా భావించకూడదు’ అనే డైలాగ్ ఆలోచన రేకెత్తింస్తుంది. ఏదో బలమైన సామజిక అంశాన్నే ఇందులో టచ్ చేశారు. సెప్టెంబర్ 20న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు – జగన్ హయాంలో అపచారం!

తిరుమలలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారని తేలిపోయింది. చివరికి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ క్వాలిటీ అత్యంత ఘోరంగా ఉండేది. దానికి కారణం...

తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి

తమిళ రాజకీయాలు మారిపోతున్నాయి. ఓ వైపు పొలిటికల్ వాక్యూమ్ ను ఉపయోగించుకుని రాజకీయ నాయకుడు అయిపోవడానికి విజయ్ కొత్త పార్టీ పెట్టారు. మరో వైపు అన్నాడీఎంకే కూడా బలమైన క్యాడర్ తో ఉంది....

వైసీపీ ఆఫీసులకూ అదే పరిస్థితి – లా ఒక్కటే !

నల్లగొండ బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో .. వైసీపీకి కూడా గుండెల్లో రాయి పడింది. బీఆర్ఎస్ పార్టీకి అదొక్కదానికే అనుమతుల్లేవేమో కానీ వైసీపీకి చెందిన ఒక్క ఆఫీసుకు తప్ప...

దేవరని రామాయణంతో ముడిపెట్టిన పరుచూరి

రచయిత పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' పేరుతో సినిమాల‌ను విశ్లేషిస్తుంటారు. ఆయన విశ్లేషణలు చాలా ప్రజాదరణ పొందాయి. తన అనుభవాలన్నీ జోడిస్తూ సినిమాల్లోని లోటుపాట్లని, మంచి విషయాల్ని చెపుతుంటారు. తాజాగా ఎన్టీఆర్ దేవర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close