తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం ఉందని ఏబీపీ న్యూస్ – సీఓటర్ ఒపీనియన్ పోల్లో వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు నెలల వ్యవధిలోనే పేదలకు లబ్ది కలిగే గ్యారంటీలను అమలు చేయడానికి ప్రయత్నించడం పాజిటివ్ గా మారిందని అనుకోవచ్చు.
రెండో స్థానంలో బీజేపీ ఉంటుందని వెల్లడయింది. బీజేపీకి తెలంగాణలో ఇంతకు ముందు నలుగురు ఎంపీలు ఉండగా.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆ స్థానాల సంఖ్య ఐదుకు చేరుతుందని ఏబీపీ న్యూస్ – సీఓటర్ ఒపీనియన్ పోల్లో వెల్లడయింది. మరో స్థానం మాత్రమే అదనంగా గెల్చుకున్నప్పటికీ.. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా మారే అవకాశాలు ఉన్నాయి.
ఇక బీఆర్ఎస్ పరిస్థితి ఘోరంగా మారనుంది. భారత రాష్ట్ర సమితికి ఒక్కటంటే ఒక్క సీటు వస్తుందని ఒపీనియన్ పోల్లో వెల్లడయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ పార్టీ మరింత ఎక్కువగా బలహీనపడింది. ఈ ప్రభావం ఓటింగ్ పై పడుతుంని తేలింది. ఒక్క సీటు మాత్రమే వస్తే.. ఇప్పటికే వలసపోయిన నేతలకు తోడు.. ఇప్పుడున్న వారు కూడా ఎవరి దారి వారు చూసుకునే అవకాశం ఉంది.