ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన ఫైనల్ ఓపీనియన్ పోల్లో ఏపీలోని మొత్తం ఇరవై ఐదు స్థానాల్లో ఇరవై స్థానాలు టీడీపీ కూటమి గెల్చుకుంటుందని తేల్చింది.
మొత్తం పదిహేను స్థానాలు టీడీపీ, జనసేన కూటమి .. ఐదు చోట్ల బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ఐదు స్థానాలకే పరిమితం కానుంది. గత ఒపీనియన్ పోల్ ప్రకారం.. వైసీపీకి ఏడు సీట్లు వచ్చేవి. కానీ గత నెల రోజుల్లో మారిన పరిస్థితులతో వైసీపీకి మరో రెండు సీట్లు కోత పడ్డాయి. ఎన్నికల నాటికి వైసీపీ పరిస్థితి మరింతగా దిగజారే అవకాశాలు ఉన్నాయి.
గత ఎన్నికల్లో 22 లోక్సభ సీట్లను గెలుచుకున్న వైఎస్ఆర్సీపీ ఘోరమైన పాలనతోప్రజల్ని వంచించింది.అందుకే కోలుకోలేనంత షాక్ ఇవ్వబోతున్నారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలో విపక్షాలన్నీ ఏకమవడం.. అదే సమయంలో వైసీపీ అనుకూల ఓట్లు చీలిపోవడం కారణంగా ఆ పార్టీ దారుణంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గత ఎన్నికల్లో 49 శాతానికిపైగా ఓట్లు తెచ్చుకున్న వైఎస్ఆర్సీపీ పదిశాతం ఓట్ల వరకూ కోల్పోయినట్లుగా ఏబీపీ న్యూస్ – సీఓటర్ ఒపీనియన్ పోల్ తేల్చింది.
మొత్తంగా ఏబీపీ న్యూస్ – సీఓటర్ ఒపీనియన్ పోల్ పూర్తిగా లోక్ సభ ఎన్నికల దృష్టితోనే నిర్వహించారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. లోక్ సభ ఎన్నికల నిష్పత్తిలోనే అసెంబ్లీ ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా. ఆ లెక్కన వైసీపీకి పాతిక నుంచి 30 మాత్రమే అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశం ఉంది.