ఓ వైపు ప్రాంతీయ పార్టీలన్నీ.. ఏకమవుతున్నాయి. మరో వైపు వాటికి అండగా నిలబడేందుకు ఎంతకైనా తగ్గేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అదే సమయంలో కేంద్రంపై ప్రజావ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోతోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏ మాత్రం బాగుండదని ఏబీపీ న్యూస్ సీఎస్డీఎస్ సంస్థ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడయింది. బీజేపీకి రెండో సారి అవకాశం ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారా అన్న అంశంపై జరిగిన సర్వేలో 47 శాతం మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా నో అని చెప్పారు. 39 శాతం అవకాశం ఇవ్వొచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. మిగిలినవారు ఇంకా నిర్ణంయ తీసుకోలేదన్నారు.
వాస్తవానికి 2014 ఎన్నికలకు వెళ్లే ముందు… .యూపీఏ టూ ప్రభుత్వంపైన… చేసిన సర్వేలో ఎలాంటి ఫలితాలొచ్చాయో.. ఇప్పుడు అవే ఫలితాలు వచ్చాయి. 2014 ఎన్నికల్లో యూపీఏ ఘోరపరాజయం పాలయింది. అప్పట్లో 39శాతం మంది ప్రభుత్వానికి మళ్లీ చాన్సివ్వబోమని చెప్పగా.. 31 శాతం మంది ఇస్తామని చెప్పారు. ఇప్పుడు కూడా.. అలాంటి సర్వేల ఫలితాలే రావడంతో బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పవన్న అంచనాలు ప్రారంభమయ్యాయి.
కొన్ని వర్గాల్లో నరేంద్రమోదీ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని సర్వేలో వెల్లడయింది. మైనార్టీలు, క్రిస్టియన్లు, సిక్కుల్లో… 70, 80 శాతం మంది తాము మరోసారి ,.. మోదీ ప్రభుత్వానికి ఓటు వేసే అవకాశం లేదని తేల్చిచెప్పారు. గిరిజనుల్లోనూ అదే భావన ఉందని సర్వేలో వెల్లడయింది. అదే సమయంలో హిందూ ఓటర్లలో స్పష్టమైన చీలిక కనిపిస్తోంది. 44 శాతం మంది బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉండగా.. 42 శాతం మంది మాత్రం అవకాశం ఇవ్వబోమంటున్నారు.
అదే సమయంలో ఏడాది చివరిలో ఎన్నికలు జరిగితే.. 34 శాతం మంది బీజేపీకి మద్దతిస్తామన్నారు. కానీ.. సరిగ్గా సమయానికే ఎన్నికలు జరిగితే.. ఓటేస్తామన్నవారి సంఖ్య 32 శాతానికి పడిపోయింది. దీన్ని బట్టి… నరేంద్రమోదీ క్రేజ్..వేగంగా తగ్గిపోతోందని సర్వే అంచనా వేసింది. ఇందులో అసలు ట్విస్ట్ ఏమిటంటే..గత ఎన్నికల్లో మోదీకి ఏకపక్షంగా పట్టం కట్టిన ఉత్తరాదిలో… ఈ సారి భారీగానే వ్యతిరేకతకనిపిస్తూండటం. మొత్తానికి కొండంత ఉన్న మోదీ ఇమేజ్…. నాలుగేళ్లకే మైనస్ లోకి రావడమే అసలు విచిత్రం.