సినిమా హీరోల అభిమానులు అసభ్యంగా తిట్టుకోవడం ఇప్పటి వరకూ చూస్తున్నాం. ఐపీఎల్ పుణ్యమా అని ఇప్పుడు అభిమానం పేరుతో సైకోలు సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. ఆటగాళ్ల కుటుంబసభ్యులపై అసభ్యకర కామెంట్లు చేస్తున్నారు. వాళ్లు..వీళ్లు కాదు..ఏకంగా ధోనీ కుమార్తెపైనే దారుణమైన వ్యాఖ్యలు చేశారు కొంత మంది సైకో ఫ్యాన్స్. ఐపీఎల్లో చెన్నై టీమ్ పెద్దగా రాణించలేకపోతోంది.గత మ్యాచ్‌లో ఓటమి పాలైంది. అంతే.. సోషల్ మీడియాలో సోకాల్డ్ సైకో ఫ్యాన్స్ చెలరేగిపోయారు. ధోనీ కూతురైన ఐదేళ్ల పాప జీవాను కూడా వదలడం లేదు.
చంపేస్తామని, రేప్ చేస్తామని..ఇలా జుగుప్సాకరంగా ట్వీట్లు చేస్తున్నారు.. విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ తర్వాత అభిమానులు జాదవ్‌ను టార్గెట్ చేశారు. జట్టు నుంచి తొలగించాలన్నారు. జాదవ్ వల్లే జట్టు ఓడిందని ఫైరయ్యారు. ఆ తర్వాత ధోనీ వంతు సభ్య సమాజం తలదించుకునేలా కామెంట్లు చే్సతున్నారు. సోషల్ మీడియాలో కిరాతకంగా ట్వీట్ చేయడం మానుకోవాలని అసలైన క్రికెట్ అభిమానులు కోరుతున్నారు . ఇలాంటి సంస్కృతి మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు.
సోషల్ మీడియా పుణ్యమా అని.. ఏది పెట్టినా చెల్లిపోతోంది. చట్టాలు సైతం కొంత మందికే అమలు చేసే పరిస్థితి వచ్చేసింది. ఈ క్రమంలో ఆటగాళ్ల మానసిక పరిస్థితి సరిగ్గా ఉండటం కష్టమే. దేశ క్రికెట్‌కు ఎంతో సేవ చేసిన ధోనీ… సరిగ్గా ఆడకోతే..క్రికెట్ పరంగా విమర్శించవచ్చు కానీ.. కుటుంబసభ్యుల కామెంట్లు చేయడం ఏమిటన్న చర్చ నడుస్తోంది. సోషల్ మీడియా వల్ల పెరిగిపోతున్న దుష్ఫలితాల్లో ఇదోభాగమని అంటున్నారు.