ఫార్ములా ఈ రేసు కేసు లొట్టపీసు కేసు అని కొట్టేస్తారని చాలా గట్టి నమ్మకం పెట్టుకున్న కేటీఆర్కు ఏసీబీ షాక్ ఇచ్చింది. క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో తీర్పు రిజర్వులో ఉన్నప్పటికీ తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉదయం పది గంటలకుక ఏసీబీ ఆఫీసుకు రావాలని నోటీసుల్లో ఆదేశించింది. నిజానికి కేటీఆర్ కు ఏడో తేదీన రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈడీ ఎదుటే హాజరు కావాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. అలాంటిది మరి ఏసీబీ కేసులో ఆరునే హాజరు కావాలని నోటీసులు రావడంతో ఆయన లీగల్ టీం కూడా ఆశ్చర్యపోతోంది.
అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై తీర్పు పెండింగ్ లో ఉన్నందున ఇలా నోటీసులు జారీ చేయడం కరెక్ట్ కాదని కేటీఆర్ తరపు వర్గం వాదించే అవకాసం ఉంది. అందుకే ఆయన హాజర్యయే అవకాశాలు లేవని చెబుతున్నారు. తీర్పు వచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు. అయితే ఆయన అరెస్టుపై మాత్రమే కోర్టు స్టే ఇచ్చింది కానీ.. విచారణపై ఇవ్వలేదని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ విచారణకు రాకపోతే.. కేటీఆర్ దర్యాప్తునకు కేటీఆర్ సహకరించలేదని కోర్టులో వాదించి అరెస్టు తర్వాత బెయిల్ రాకుండా చేసే అవకాశం ఉంది.
తన కేసును హైకోర్టు క్వాష్ చేస్తే.. ఈడీ కేసు కూడా ఉండదని కేటీఆర్ అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఏసీబీ దూకుడు చూస్తే ఆయనకు చిక్కులు తప్పేలా లేవు. ఒక వేళ హైకోర్టులో అనుకూల తీర్పు రాకపోతే ఆయన వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. కానీ విచారణలో ఆయనను అరెస్టు చేయుకుండా ఉంటారన్న గ్యారంటీ ఉండదు.