ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడుపై చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకునేందుకు ఏపీసీ కోర్టు నిరాకరించింది. విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జిషీట్ వేసేందుకు సీఐడీ అధికారులు వచ్చారు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం చార్జిషీట్ వేసేందుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. చార్జిషీట్ పరిగణలోకి తీసుకోలేమని న్యాయమూర్తి తెలిపారు. అయితే పరిగణలోకి తీసుకోవచ్చని చెప్పిన ఏసీబీ తరపు న్యాయవాదులు వాదించారు. దీనికి సంంధించిన కేసుల్లో తీర్పులు ఏమైనా ఉంటే చూపించాలని న్యాయనూర్తి ఆదేశించారు. కేసు విచారణ ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేశారు.
ఇప్పుడీ అంశం సంచలనంగా మారింది. అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నప్పుుడు ఈఎస్ఐ వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఏసీబీ కేసు పెట్టింది. ఆయన స్వగ్రామం నిమ్మాడలో ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఇంటి గోడలు దూకి మరీ తెల్లవారుజామున అచ్చెన్నను అరెస్టు చేశారు. దాదాపుగా రెండున్నర నెలల పాటు జైల్లో ఉంచారు. అన్నీ ఆధారాలు ఉన్నాయని పెద్ద పెద్ద మాటలు ఏసీబీ అధికారులు చెప్పారు. కానీ ఇప్పటి వరకూ చార్జిషీటు దాఖలు చేయలేదు. మూడున్నరేళ్ల పాటు గోళ్లు గిల్లుకుని ఇప్పుు చార్జిషీటు అంటూ ఏసీబీ కోర్టుకు వచ్చారు. ఈ కేసులో ఒక్క రూపాయి అచ్చెన్నకు లేదా ఇతరులకు అందినట్లుగా చూపించలేకపోయారు.
ఇప్పుడు చార్జిషీటు దాఖలు చేసేందుకు ప్రయత్నించారు. కానీ కోర్టు పరిగణనలోకి తీసుకునేందుకు అంగీకరించకపోవడం ఏసీబీ అధికారులకు ఇబ్బందికరంగా మారింది. కోర్టు చార్జిషీటును పరిగణనలోకి తీసుకోకపోతే కేసు విషయంలో ఏసీబీ చేసిదంతా చట్ట విరుద్ధమవుతుంది. అప్పుడు అధికారులైప చర్యలు తీసుకుంటున్నారు.