సీఎం జగన్ సభకు వాలంటీర్లు తీసుకు వచ్చిన ఓ వృద్ధురాలికి ప్రమాదం జరిగింది. ఆ వృద్ధురాలు కాలును తీసేశారు. అయితే ఒక్క వైసీపీ నేత … ప్రభుత్వ అధికారి కూడా పరామర్శించలేదు. అసలు ఆమెను సీఎం జగన్ సభకు తీసుకు రాలేదని పోలీసులు , అధికారులు చెబుతున్నారు. ఆమె వ్యక్తిగత పని మీద రాజానగరం నుంచి వచ్చారని కవర్ చేసుకుంటున్నారు. అక్కడ రోడ్డు ప్రమాదమే జరిగిందని అంటున్నారు.
కనీసం అలా అయినా కేసు నమోదు చేయాలి. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు కేసు నమోదు చేయడం సాధారణం. కానీ కేసు నమోదు చేయలేదు. తమ పరిధి కాదని రెండు పోలీస్ స్టేషన్ల సిబ్బంది చెబుతున్నారు. సీఎం కార్యక్రమం కోసం రాజమండ్రి మొత్తం నిర్బంధించారు. ఎక్కెడక్కడి నుంచి పెన్షన్లు వచ్చే వారిని తరలించారు. ఆ బస్సుల్లోనే ఆమె వచ్చింది. అయినప్పటికీ ఆమె వ్యక్తిగత పనిపై వచ్చారని పోలీసులు, అధికారులు చెబుతున్నారు.
సరే ఆమె వ్యక్తిగత పని మీద వచ్చినా.. జగన్ సభకోసం తీసుకు వచ్చినా.. ఆ వృద్ధురాలి పట్ల కనీస మానవత్వం చూపడం.. లక్షణం. రాజమండ్రిలో ప్రమాదం జరిగితే.. కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాలు తీసేయాల్సి వచ్చింది. కానీ పట్టించుకున్నవారు లేరు. కొంత ఆర్థిక సాయం చేసిన వారు లేరు. టీడీపీ నేతలే పరామర్శించారు. ఇక్కడే ప్రభుత్వానికి కానీ.. అధికారులకు కానీ మానవత్వం ఉందా అనే ప్రశ్న స్తోంది.