అచ్చెన్నాయుడు స్టైలే వేరు.ప్రతిపక్షంలో ఉన్నప్పుు ఆయన అసెంబ్లీలో మాట్లాడకుండా అరెస్టు చేయాలన్న వ్యూహాన్ని అధికార పార్టీ పాటిస్తుంది. అది ఆయన టంగ్ పవర్. కానీ బయట మాత్రం ఆయన మాటలు వివాదాస్పదమవుతూ ఉంటాయి. తాజాగా ఎన్నికల్లో గెలుపోత్సాహంతో ఆయన ..తన అన్న ఎర్రన్న కుమారుడు, కేంద్ర కేబినెట్ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి శ్రీకాకుళం వెళ్లారు. భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు భరోసా ఇవ్వాలనుకున్నారు.
ఐదేళ్లు ఇబ్బంది పడ్డారు.. ఇక నుంచి ఎలాంటి సమస్యలూ రావు. ప్రభుత్వ ఆఫీసుల్లో మన పనులు అయిపోతాయని భరోసా ప్రకటించారు. ఇందు కోసం ఆయన విచిత్రమైన సలహా ఇచ్చారు. అదేమిటంటే.. మెడలో పసుపు బిళ్ల వేసుకుని వెళ్తే.. చాలు అధికారులు కూర్చోబెట్టి, టీ కాఫీలు ఇచ్చి ప నులు చేస్తారట. లేకపోతే ఏం చేస్తానో మీరే చూస్తారంటూ… ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఈ మాటలు కాస్త అతిశయంగా ఉన్నాయి. కార్యకర్తలకు భరోసా ఇవ్వడం కన్నా అధికారుల్ని బెదిరించేలా ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అచ్చెన్న మాటలపై అప్పుడే విమర్శలు ప్రారంభమయ్యాయి. ఐదేళ్ల పాటు వైసీపీ నేతలు దాడులే కాదు.. మాటలతో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసినా.. నోరు మెదపని వారు ఇప్పుడు కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు కొన్ని మాటలు చెబితే.. తప్పు పడుతున్నారని టీడీపీ నేతలు తమపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు. టీడీపీ కార్యకర్తలకు ప్రభుత్వ ఆఫీసుల్లో గౌరవమర్యాదలు లభిస్తాయన్న ఉద్దేశంతోనే అచ్చెన్న చెప్పారని ఇందులో బెదిరిపంలేమీ లేవని అంటున్నారు.