దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం హిట్స్ తర్వాత హీరో మంచు విష్ణు, దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి కాంబినేషన్లో రూపొందిన మూడో సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’. ఈ సినిమా అదృష్టం బాగుంటే ఈపాటికి విడుదలవ్వాలి. గ్రహచారం గంట కొట్టడంతో జనవరి 26న విడుదల కావలసిన సినిమా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. కానీ, సినిమా రెడీ అయ్యింది. హిట్ సినిమాకు కావలసిన హంగులన్నీ ‘ఆచారి అమెరికా యాత్ర’లో ఉన్నాయని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ఫ్యామిలీతో కలసి ఆయన సినిమా చూశారు. ముఖ్యంగా నా ఇద్దరు అమ్మాయిలు అరియానా, వివియానాలకు సినిమా బాగా నచ్చిందని ‘గాయత్రి’ విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో విష్ణు చెప్పారు. సినిమా చూసిన తర్వాత అమ్మాయిలు ఇద్దరూ ‘డాడ్.. యు ఆర్ సో ఫన్నీ’ అని కాంప్లిమెంట్స్ ఇచ్చారని విష్ణు తెలిపారు. విష్ణు చెప్పినట్టు సినిమాలో ఫన్ ఫ్యాక్టర్ వర్కవుట్ అయ్యి, పిల్లలకు నచ్చితే పెద్ద హిట్ కొట్టినట్టే.