సమ్మర్ సీజన్లో రిలీజ్ డేట్స్‌పై ఆల్రెడీ చాలామంది స్టార్ హీరోలు, యంగ్ హీరోలు కర్చీఫ్స్ వేశారు. మార్చ్ థర్డ్ వీక్ నిఖిల్ ‘కిరాక్ పార్టీ’తో స్టార్ట్ చేస్తే.. మే మంత్ ఎండ్ నాగార్జున ‘ఆఫీసర్’ వరకూ ఆల్మోస్ట్ వారానికి ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నిర్మాతలు బంద్ విరమించుకుంటే! సమ్మర్ సీజన్లో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్టులో మంచి విష్ణు హీరోగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆచారి అమెరికా యాత్ర’ కనపడడం లేదు. నిజానికి, జనవరి 26న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది. ఫిబ్రవరి 9న తండ్రీకొడుకులు మోహన్ బాబు, విష్ణు నటించిన ‘గాయత్రి’ విడుదల కావడంతో ఆచారి గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ‘గాయత్రి’ వచ్చింది. వెళ్ళింది. ‘ఆచారి అమెరికా యాత్ర’ గురించి ఎలాంటి అప్డేట్ లేదు.
ఫైనాన్షియల్ ఇష్యూల వల్ల సినిమా విడుదల వాయిదా పడిందని తెలుస్తోంది. ఆల్రెడీ ‘గాయత్రి ‘ ఆశించిన రీతిలో హిట్ కాకపోవడంతో మంచు విష్ణు బయటకు రావడం లేదు. ‘గాయత్రి ‘ సక్సెస్ మీట్‌కి కూడా మోహన్ బాబు ఒక్కరే వచ్చారు. దాంతో భారమంతా నిర్మాత ఎంఎల్ కుమార్ చౌదరి మీద పడిందట. ఆయన గత సినిమాల సమస్యలు ఆచారిపై పడ్డాయట. ఈ సమస్యలకు మంచు విష్ణు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నార్ట. నిజానికి, ‘గాయత్రి’ సినిమాను జనవరిలో విడుదల చేయాలనుకున్నారు. అయితే.. విష్ణు యాక్సిడెంట్ వల్ల ‘ఆచారి అమెరికా యాత్ర’ షూటింగ్ షెడ్యూల్స్ డిస్టర్బ్ కావడంతో ముందు ఎంఎల్ కుమార్ చౌదరికి ఛాన్స్ ఇచ్చారు. ఆయన జనవరి 26న సినిమా రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేయడం, తర్వాత వెనక్కి తగ్గడంతో విష్ణు అప్ సెట్ అయ్యాడట. సినిమా బాగా వచ్చింది కానీ ప్రోపర్ రిలీజ్ ప్లాన్స్ లేకపోవడంతో సరైన క్రేజ్ రావడం లేదని హీరో ఫీలింగ్. ఎప్పుడు విడుదల చేయాలనుకున్నా పబ్లిసిటీ విషయంలో నిర్మాతకు హెల్ప్ చేయడానికి విష్ణు రెడీ. కానీ, నిర్మాత తన భారాలను దించుకుని ఎప్పుడు విడుదల చేస్తారో?