చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం `ఆచార్య`. ఈ దసరాకి విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆలస్యమైంది. డిసెంబరు 17న ఆచార్య వస్తుందని ప్రచారం జరిగింది. సరిగ్గా అప్పుడే `పుష్ఫ` రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. రెండు మెగా సినిమాల మధ్య క్లాష్ చూస్తామని భావించారంతా. కానీ.. ఇప్పుడు డిసెంబరులోనూ.. ఈ సినిమా రావడం లేదు. ఏకంగా ఫిబ్రవరి కి షిఫ్ట్ అయిపోయింది. 2022 ఫిబ్రవరి 4న ఆచార్య విడుదల అవుతోంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఆచార్యషూటింగ్ దాదాపుగా పూర్తయిపోయింది. చిరు కూడా లూసీఫర్ రీమేక్ `గాడ్ ఫాదర్` పనుల్లో పడిపోయారు. అయితే ఏపీలో సినిమా విడుదలకు సరైన వాతావరణం లేదు. టికెట్ రేట్ల గొడవ ఎలాగూ ఉంది.కరోనా భయాలు ఇంకా వెంటాడుతోండడంతో.. పెద్ద సినిమాల విడుదల విషయంలో నిర్మాతలు భయపడుతున్నారు. అందుకే ఆచార్యని ఫిబ్రవరికి షిఫ్ట్ చేసేశారు.