ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ దామోదరనాయుడిని పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అరెస్ట్ చేశారు. దామోదరనాయుడు వద్ద గతంలో ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఓ అటెండర్ పని చేసేవారు. ఆయన విధులకు హాజరు కాకపోతూండటంతో.. తొలగించారు. ఆ తొలగించిన అటెండర్… దామోదరనాయుడు.. తనను కులం పేరుతో దూషించారని.. ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. ఆయనను అరెస్ట్ చేశారు. అయితే. దామోదరనాయుడు కులం పేరుతో దూషించింది.. యూనివర్శిటీలో కాదు.. సచివాలయంలో అని ఫిర్యాదుదారుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు. దామోదరనాయుడు సచివాలయానికి వస్తున్నారని తెలిసి… తన ఉద్యోగం గురించి అడిగేందుకు.. ఆ మాజీ అటెండర్ అక్కడకు వెళ్లారట. అక్కడ వీసీని పట్టుకుని తన ఉద్యోగం గురించి ప్రస్తావించడంతో.. కులం పేరుతో దూషించారని.. ఆయన ఫిర్యాదు చేశారు.
గవర్నర్ పర్యవేక్షణంలో ఉండే యూనివర్శిటీ వీసీని ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేయడం.. విద్యారంగంలో సంచలనాత్మకం అయింది. దామోదరనాయుడు ముక్కుసూటిగా ఉండే మనిషిని క్యాంపస్లో చెబుతూంటారు. ఆయన ప్రతీ విషయంలోనూ కఠినంగా ఉండటంతో.. చాలా మంది ఉద్యోగులకు వ్యతిరేకమయ్యారు. ప్రభుత్వం మారినప్పటి నుండి.. ఆయనపై.. అనేక ఫిర్యాదులు.. వెళ్లాయి. అనంతపురం జిల్లాకు చెందిన ఓ శాస్త్రవేత్త ఆధ్వర్యంలో పలువురు బోధన, బోధనేతర సిబ్బంది… కొత్త ప్రభుత్వంపై అనేక ఫిర్యాదులు చేశారు. దీనిపై.. ప్రభుత్వం విచారణ చేయించింది. వీసీ తీసుకుంటున్న చర్యలు నచ్చకే.. ఈ ఫిర్యాలు చేశారని ఆ విచారణలో తేలింది. ఆ తర్వాత గవర్నర్ కూ ఫిర్యాదు చేశారు. గవర్నర్ హరిచందన్ కూడా విచారణ జరిపించారు. ఈ నివేదిక ఇంకా బయటకు రాలేదు.
వర్శిటీలో అక్రమాలు… ఆయన తీరుపై.. వరుసగా ఫిర్యాదులు వస్తున్నా.. ఏ చర్యలు తీసుకునే పరిస్థితి లేకపోవడంతో… తీసేసిన ఉద్యోగి ఫిర్యాదును.. ఉపయోగించుకుని అరెస్ట్ చేశారన్న విమర్శలు ఉన్నత విద్యారంగానికి చెందిన ప్రముఖుల్లో వినిపిస్తోంది. నిజానికి వైస్ చాన్సలర్ ను అరెస్ట్ చేయాలంటే.. ముందుగా గవర్నర్ కు సమాచారం ఇవ్వాల్సి ఉటుందని చెబుతున్నారు. గవర్నర్ అన్ని విశ్వవిద్యాలయాలకు చాన్సలర్ గా ఉంటారు. వీసీలను గవర్నరే నియమిస్తారు. ఈ క్రమంలో.. ఈ కేసు అందరిలోనూ ఆశ్చర్యానికి కారణం అవుతోంది.