రాజమౌళి రామారావు రామ్ చరణ్ ల ‘ఆర్ఆర్ఆర్’ మంచి విజయం సాధించింది. ఉగాది పండగ కూడా ఆర్ఆర్ఆర్ కి బాగా కలిసొచ్చింది. హిందీలో కూడా వసుళ్ళూ స్టడీగా వున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగులో రానున్న మరో పెద్ద సినిమా ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలసి నటిస్తున్న మెగా మల్టీస్టారర్. చిరంజీవి అందరికీ తెలిసిన నటుడు. ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ పాన్ ఇండియా ఫ్యాన్స్ వచ్చారు. అల్లూరి పాత్రని నార్త్ లో కొందరు రాముడిగా కూడా ఊహించుకొని కనెక్ట్ అయ్యారు. దీంతో ఆచార్య ని కూడా అన్ని భాషల్లో విడుదల చేస్తారని అనుకున్నారంత.
అయితే ఆచార్య నిర్మాతలలో ఒకరైన అవినాష్ రెడ్డి మాత్రం ఆచార్య కేలవంలో తెలుగులోనే విడుదల చేస్తామని వెల్లడించారు. ‘మా ద్రుష్టి పాన్ ఇండియా పై లేదు. తెలుగులోనే భారీగా విడులకు ప్లాన్ చేస్తున్నాం. తెలుగు రాష్ట్రలో దాదాపు 2000స్క్రీన్ లో ఆచార్య విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. ఓవర్సిస్ లో కూడా భారీగా విడుదల చేస్తాం’ అని వెల్లడించారు నిర్మాత అవినాష్ రెడ్డి. ఆచార్యపై అభిమానులకు మంచి అంచనాలు వున్నాయి. చింజీవి -రామ్ చరణ్ ఇదివరకూ చిన్న చిన్న గెస్ట్ రోల్స్ లో కలసి నటించారు. కానీ ఆచార్య లో ఫుల్ లెంత్ రోల్స్ చేస్తున్నారు. దీంతో మెగా అభిమానులు సినిమాలో భారీ అంచనాలు పెట్టుకున్నారు.