కాస్టింగ్ కౌచ్ సమస్యపై టీవీ చానెళ్లలో జరుగుతున్న వాడివేడి చర్చల కారణంగా ఒకదాని తర్వాత ఒకటి కొత్త పేర్లు, కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. శ్రీ రెడ్డి కలిపిన ఈ తేనె తుట్టలో వైవా హర్ష, శ్రీరామ్, దగ్గుబాటి అభిరాం,కోన వెంకట్, కొరటాల లాంటి పేర్లు శ్రీ రెడ్డి స్వయంగా బయటపెడితే (డైరెక్ట్ లేదా ఇన్-డైరెక్ట్ గా) , శ్రీ రెడ్డి స్ఫూర్తితో మరికొంతమంది యువతులు టీవీ చానెళ్లకు వచ్చి లేదా ఫోన్ చేసి – వాకాడ అప్పారావు (ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, బాలకృష్ణ నటించిన మహారథి సినిమా నిర్మాత), కత్తి మహేష్ లాంటి పేర్లు బయటపెట్టారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే సామాజిక కార్యకర్త సంధ్య ఒక చానల్ డిబేట్లో జీవిత రాజశేఖర్ పై చేసిన ఆరోపణలు ఒక్కటీ ఒకెత్తు. విన్న వాళ్ళకి కళ్ళు బైర్లు కమ్మేలా ఉన్న ఆ ఆరోపణలు వివరాలు ఇవీ..
సామాజిక కార్యకర్త సంధ్య మాట్లాడుతూ – జీవిత రాజశేఖర్ సినీ పరిశ్రమ గురించి నిన్న చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇంతకీ జీవిత రాజశేఖర్ ఏమన్నారంటే తెలుగు సినీ పరిశ్రమ చాలా మంచిది, కాస్టింగ్ కౌచ్ లాంటి సమస్యలు ఇక్కడ లేవు అన్న అర్థం వచ్చేలా మాట్లాడారు. జీవిత మాటల్లో హిపోక్రసీని తూర్పారబట్టిన సామాజిక కార్యకర్త సంధ్య ఆవిడపై చాలా బలమైన ఆరోపణలు చేశారు.
ఇంతకీ సంధ్య ఏమన్నారంటే – జీవిత రాజశేఖర్ తన భర్త, నటుడు రాజశేఖర్ కోసం పేద అమ్మాయిలని ట్రాప్ చేసేవారని, పల్లెటూర్లనుంచి చదువు, ఉద్యోగాల కోసం హైదరాబాద్ వచ్చి హాస్టల్లో ఉండే అమ్మాయిలను డబ్బు ఆశచూపి జీవితయే స్వయంగా ఆ అమ్మాయిలను తన భర్త పడక గదికి పంపేవారని పదునైన ఆరోపణలు చేశారు. ఒకసారి అమీర్ పేట లో ఒక హాస్టల్లో ఉండే అమ్మాయి కి సంబంధించిన సంఘటన సంధ్య బయటపెట్టారు. విపరీతమైన జ్వరం వచ్చి ఒక అమ్మాయి హాస్టల్లో పడుకుని ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఫోన్ కాల్ వస్తే అదే రూం లో ఉన్నా తన ఫ్రెండ్ ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంది. అవతల వైపు ఫోన్లో ఉన్న జీవిత ఆ అమ్మాయి అనుకొని తన ఫ్రెండ్ ని పచ్చి బూతులు మాట్లాడుతూ తిట్టింది. “ఏమే..(బూతు) వస్తానని చెప్పిరాకపోతే ఎలా? నువ్వు రాకపోతే ఇక్కడ రాజశేఖర్ తో ఎవడు పడతాడు?” అంటూ ఘోరంగా బూతులు తిట్టింది.అయితే పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను అని చెప్తూ ఉండే తన రూమ్మేట్ ని ఆ ఫ్రెండ్ ప్రశ్నించింది. అప్పుడు ఆ అమ్మాయి చెప్పిన వివరాలతో, సామాజిక కార్యకర్త సంధ్య ని సంప్రదించింది తన ఫ్రెండ్ . అప్పుడు సంధ్య ఆ అమ్మాయి చేత ఆంధ్రజ్యోతి పత్రిక కు ఉత్తరం వ్రాయిస్తే, ఆంధ్రజ్యోతి పత్రిక ఆ ఉత్తరాన్ని ప్రచురించింది కూడా.
ఆ తర్వాత మరొక సందర్భంలో ఒక సూపర్ మార్కెట్ లో పనిచేసే అమ్మాయి కూడా జీవిత గురించి ఇదే తరహా ఫిర్యాదుతో సామాజిక కార్యకర్త సంధ్య ని సంప్రదించింది. ఈ రెండు ఫిర్యాదులే కాకుండా ఇతర వ్యక్తుల నుంచి జీవిత గురించి ఇలాంటి ఎన్నో ఫిర్యాదులు వచ్చాయట సంధ్య కి. అయితే ఈ రెండు కేసులు మాత్రం స్వయంగా సంధ్య తనే హ్యాండిల్ చేసింది. ఇలాంటి జీవిత వచ్చి సినిమా ఇండస్ట్రీ మంచిది అని చెప్పడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉందని సామాజిక కార్యకర్త చేసింది సంధ్య ఎద్దేవా చేసింది. భవిష్యత్తులో సినీ పరిశ్రమ లో ఇలాంటి లైంగిక వేధింపులను నివారించడానికి ఏర్పాటు చేయనున్న “క్యాష్” (Committee Against Sexual Harassment) కమిటీలో జీవిత లాంటి వాళ్లను సభ్యులు గా చేరిస్తే ఆ కమిటీలు ఎలా పనిచేస్తాయో ఊహించవచ్చు అని చెప్పుకొచ్చింది సామాజిక కార్యకర్త సంధ్య.
జీవిత రాజశేఖర్ ల పై ఈ తరహా ఆరోపణలు ఇంత బలంగా రావడం ఇదే తొలిసారి. జీవిత వీటిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఏదిఏమైనా ఈ ప్రకంపనలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.