గాంధి జయంతి నాడు చంచల్ గూడా ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా సిని నటుడు కమెడియన్ ఆలి చంచల్ గూడ జైలులో సంచరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తన మార్క్ కామెడీని పండించి నవ్వులు పంచారు. అయితే జైలు డిఐజి సలహా మేరకు నలుగురు మహిళా ఖైదీలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు ఆలి. కార్యక్రమంలో భాగంగా ఆటల పోటీల్లో గెలుపొందిన ఖైదీలకు బహుమతులు అందించారు.
జైలు అధికారులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గాంధి జయంతి నాడు ఖైదీల సంక్షేమ కార్యక్రమానికి ఎవరో ఒక సినిమా స్టార్స్ ని అతిధిగా పిలిపించి కార్యక్రమాలను చేస్తున్నామని చెప్పారు. ఈసారి అతిధిగా వచ్చిన ఆలిని అభినందిస్తూ ఖైదీల దత్తత విషయం గుర్తుచేశారు. వారి సూచనల మేరకే మహిళా ఖైదీలను దత్తత తీసుకుంటున్నట్లు.. వారి కుటుంబానికి కావాల్సిన కనీస అవసరాలకు తాను సహాయం అందిస్తానని అన్నారు.
కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ బొజ్జా రాహుల్ కూడా పాల్గొన్నారు. చంచల్ గూడా జైల్ బహిరంగ ఆవరణలో కార్యక్రమం అనంతరం మెడికల్ క్యాంప్ ని కండెక్ట్ చేశారు జైల్ అధికారులు.