జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే వెళ్లి కలిసేందుకు… సినీ నటులు వ్యాపారులు కాదని..కళాకారులని వ్యాఖ్యానించిన… నటుడు రాజేంద్రప్రసాద్‌పై… ఎస్వీబీసీ చానల్ చైర్మన్ , సినీ కమెడియన్ ఫృధ్వీ భగ్గుమన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే.. తాటతీస్తానని హెచ్చరించారు. కొద్ది రోజుల క్రితం.. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న రాజేంద్రప్రసాద్.. మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆ సమయంలో… సినీ ఇండస్ట్రీ పెద్దలపై ఫృధ్వీ చేస్తున్న విమర్శలు ప్రస్తావనకు వచ్చాయి. జగన్ సీఎం అవగానే కలవాల్సిన అవసరం సినీ నటులకు ఏముందని రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. సందర్భం వచ్చినప్పుడు కలుస్తారని వ్యాఖ్యానించారు.
జగన్ సీఎం అవడం.. సినీ పెద్దలకు ఇష్టం లేదని.. అందుకే.. వారు జగన్మోహన్ రెడ్డిని కలిసి కనీసం శుభాకాంక్షలు చెప్పలేదని… మండిపడ్డారు. అంతటితో ఆగకుండా.. అదే చంద్రబాబు గెలిచి ఉంటే.. ప్రత్యేక విమానాల్లో వెళ్లి సన్మానాలు చేసేవారన్నారు. దీనిపై… టాలీవుడ్ లో విస్తృత చర్చ జరిగింది. బహిరంగంగా ఎవరూ స్పందించలేదు. అయితే వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసిన.. మరో నటుడు .. పోసాని కృష్ణమురళి… మాత్రం.. ఫృధ్వీ వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఆవేశంలో అలా అని ఉంటారని … అలా వ్యాఖ్యానించడం తప్పన్నారు. ఆ తర్వాత ఫృధ్వీ వ్యాఖ్యలపై రాజేంద్రప్రసాద్ మాత్రమే స్పందించారు.
రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై… ఫృధ్వీ ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు. రోజా నియోజకవర్గం చంద్రగిరికి వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజేంద్రప్రసాద్ పై ఫైరయ్యారు. తిరుమలలో రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వర్గవిభేదంగా ఉన్నాయని మండిపడ్డారు. సినిమా ఇండస్ట్రీ వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలపమన్నాను తప్ప తప్పుగా మాట్లాడలేదని … చంద్రబాబు సీఎం అయితే సత్కారాలు చేస్తారు.. జగన్ సీఎం అయితే విమర్శలు చేస్తారా అని ఆయన విరుచుకుపడ్డారు. జగన్‌ను ఎవరు విమర్శించిన తాట తీస్తానంటూ ఘాటుగా హెచ్చరించారు. సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు… రాజకీయంగా వైసీపీ అధినేత వద్ద గుర్తింపు పొందిన ఫృధ్వీ.. ఫిల్మ్ ఇండస్ట్రీని రాజకీయంగా బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. మరి ఫృధ్వీ హెచ్చరికలకు… రాజేంద్రప్రసాద్ ఎలా స్పందిస్తారో..?