కల్వకుంట్ల తారక రామారావు ఇప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీలకు తారకమంత్రంలాంటి వారు. ఆయన పుట్టిన రోజు వస్తే.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎవరికీ విష్ చేస్తూ పోస్టులు పెట్టని వారు కూడా…యాక్టివ్ అయిపోతారు. కొద్ది రోజుల కిందట ఇది చూశాం. దీన్ని మరింత అడ్వాన్స్ గా ముందుకు తీసుకెళ్తున్నారు టాలీవుడ్ ప్రముఖులు. అదే సీఎంల రిలీఫ్ ఫండ్‌కు సాయం చేయడం. కొద్ది రోజుల క్రితం విజయ్ దేవరకొండ… తన ఫిల్మ్‌ఫేర్ అవార్డుని ఓ బడా ఫార్మా కంపెనీకి అమ్మేయగా వచ్చిన రూ.25 లక్షల చెక్‌ను… కేటీఆర్‌కు అందించారు. అర్జున్ రెడ్డి టైం నుంచి విజయ్ దేవరకొండ, కేటీఆర్ బాండింగ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయింది. వాళ్లింటికి వీళ్లు.. వీళ్లింటికి వాళ్లు రాకపోకలు కూడా సాగించారు. ఆ ఫ్రెండ్షిప్.. సినిమాల నుంచి వ్యక్తిగతం వరుకూ వెళ్లిపోయింది.
ఇప్పుడు మరో యాక్టర్ … కుమారవర్మ అలియాస్ సుబ్బరాజు కూడా.. ఓ ఫంక్షన్లో కేటీఆర్ కనిపించీ కనించగానే వెళ్లిపోయి చేతిలో “చెక్” పెట్టేశారు. కేటీఆర్ ఆశ్చర్యపోయారు. ముఖ్యమంత్రి సహాయనిధి కోసం తన వంతు సాయం అని సుబ్బరాజు సిగ్గుపడుతూ చెప్పడంతో.. కేటీఆర్ కూడా గర్వంగా ఫీలయ్యారు. దాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు. అంత వరకూ బాగానే ఉంది కానీ.. ఎవరైనా… సీఎం రిలీఫ్ ఫండ్‌కు నిధులు..ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడో.. ప్రభుత్వం పిలుపునిచ్చినప్పుడో ఇస్తారు. లేకపోతే.. విజయ్ దేవరకొండ ఇచ్చినట్లు.. ఊహించని.. సంపద వచ్చినపడినప్పుడు ఇస్తారు. మరి ఇప్పుడు సుబ్బరాజు ఎందుకిచ్చారు..?
ఎక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా టాలీవుడ్ అధికారం అండ కోరుకుంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు.. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలాంటి సమస్య వచ్చినా చంద్రబాబు వద్దకే వెళ్లేది. దీనిపై ఓ సారి టీఆర్ఎస్లో చేరి మంత్రి అయిన తలసాని కూడా ఫైరయ్యారు. ఆ తర్వాత టాలీవుడ్‌ను ఎన్నో వివాదాలు చుట్టు ముట్టాయి. వాటిలో “క్యాస్టింగ్ కౌచింగ్ .. హిడెన్ డ్రగ్స్” వరకూ చాలా కేసులున్నాయి. అన్నీ సంచలనం సృష్టించాయి. ఇంకేముంది.. బడా సెలబ్రిటీలు… ఊచలు లెక్కబెట్టబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అన్నీ తేలిపోయాయి. ఇప్పుడు తెలంగాణతో టాలీవుడ్‌కి సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే ఇలా సుబ్బరాజు లాంటి వాళ్లు సీఎం సహాయనిధికో … ప్రభుత్వానికి “చెక్‌లు” పెట్టేస్తున్నారు..అనుకోవచ్చు.