మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, బస్ స్టాప్ చిత్రాలతో ఆకట్టుకొంది శ్రీదివ్య. ఇప్పుడు పెన్సిల్ సినిమాలో నటించింది. విశాల్ రాయుడులోనూ తనే కథానాయిక. తెలుగమ్మాయే అయినా, తమిళం నుంచి కూడా తనకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. తమిళంలో శ్రీదివ్యని తమ ఇంటి అమ్మాయిగానే చూసుకొంటున్నారు. దాంతో తమిళ ప్రేక్షకులపై కూడా శ్రీదివ్య ప్రేమ పెంచుకొంది. అక్కడ తనవంతుగా సేవా కార్యక్రమాల్ని చేస్తోందట. ఈ విషయాన్ని కథానాయకుడు విశాల్ స్వయంగా చెప్పాడు.
ఈమధ్య చెన్నైని వరదలు ముంచెత్తాయి. ఆ సందర్భంలో శ్రీదివ్య ఏకంగా రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిందట. అంతేకాదు.. కొన్ని గ్రామాల్లో కనీసం మహిళలకు మరుగుదొడ్డి సదుపాయాలు లేవని నడియార్ సంఘం టాయ్లెట్లను కట్టివ్వాలనుకొంది. శ్రీదివ్య అప్పటికప్పుడు తన వంతుగా పది టాయ్లెట్లకు అవసరమయ్యే ఆర్థిక సహాయాన్ని అందించిందట. ”నడియార్ సంఘంలో శ్రీదివ్య కీలక సభ్యురాలు. మేం ఎప్పుడు ఏం అడిగినా నో చెప్పదు. అంతమంచి అమ్మాయి” అంటూ విశాల్ తెగ పొగిడేస్తున్నాడు.