ఈ మధ్య ఏ సినిమా విడుదల అవుతున్నా పవన్ కల్యాణ్ నామస్మరణ చేయకుండా మాత్రం సినిమాలు విడుదల కావడం లేదు. సినిమాలకి సంబంధించిన ఈవెంట్స్‌లో, లేదంటే డైరెక్ట్‌గా సినిమాలోని ఏదో ఒక సీన్లో పవన్ పేరు వాడటం పరిపాటి అయిపోయింది.
30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పృథ్వీ: ఓ వెబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీ పవన్ కల్యాణ్ ని ఆకాశానికెత్తేశారు. ‘హార్వర్డ్ యూనివర్శిటీ వారు ప్రత్యేకంగా ఆహ్వానించిన ఆయనని, రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఆయనని ప్రత్యేకంగా పొగడాల్సిన అవసరం ఏముంటుంది. నేను పవన్ వ్యక్తిత్వం, మంచితనం చూసి స్పందిస్తున్నాను తప్ప డబ్బా కొట్టడానికో, ఆయనతో సినిమాలు చేయడానికో మాత్రం కాదు. నిజంగా చెప్పాలంటే ఆయన నడిచే అగ్నిగోళం. ఇటీవల పవని ని చూస్తే ఆయన ప్రక్కన ఒక కూజా, ఒక మట్టిగ్లాసు ఉన్నాయి. డౌన్ టు ఎర్త్ పర్సన్. న్యూటన్, ఇంకా పెద్ద పెద్ద శాస్త్రవేత్తల గురించి పుస్తకాలలో చదువుకుంటున్నాం.. కానీ ముందున్న మేధావులను, గొప్ప వ్యక్తులను గుర్తించలేకపోతున్నాం..’’ అని పృథ్వీ తెలిపారు.
ప్రసన్న (స్నేహ భర్త, జవాన్ విలన్): “‘జవాన్’ ఆడియో ఫంక్షన్లో మెగా అభిమానుల సందడి కళ్లారా చూశాను. పవన్ కళ్యాణ్ పేరు, సినిమా చెబితే వస్తున్న రెస్పాన్స్ చూస్తేనే నాకు మతిపోతోంది. పవన్ సినిమాలలో కంటే బయట అతని వ్యక్తిత్వం నాకు చాలా చాలా ఇష్టం . పవన్ పేరు చెప్తే ఫాన్స్ చేసే అల్లరి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. తెలుగు రాష్ట్రాలు అభిమానులు తమ హీరోలను దేవుడిగా భావించడం చూసి ఆశ్చర్యపోతున్నా”
‘సప్తగిరి ఎల్ఎల్బి’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పరుచూరి గోపాలకృష్ణ:
“పవన్‌కల్యాణ్‌కు ఇప్పటివరకూ మేము ఒక్క సినిమా కూడా రాయలేదు కానీ, ‘సప్తగిరి ఎల్ఎల్బి’ చిత్రంతో పవన్ అభిమానికి రాశామనే ఆనందం ఉంది. అందుకే సప్తగిరితో చెప్పాం – నీ తొలి సినిమాను పవన్ తో రిలీజ్ చేయించుకున్నావు కదా! వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకో. పవన్ ఆశీస్సు గొప్పది. మనసు గొప్పది. పవన్ చేయి ఇంకా గొప్పది. ఎక్స్‌ప్రెస్ ఎంత వేగంగా వెళ్లిందో.. ఈ సినిమా కూడా అంత బాగా ఆడుతుంది.”
ఇక ఆమధ్య పవన్ మీద నెగటివ్ కామెంట్లు చేస్తున్న కత్తి మహేష్ ఒక చిన్న సినిమా ఆడియో ఫంక్షన్ లో పాల్గొంటే, వచ్చిన ఆడియెన్స్ పవన్ కి జై కొట్టమని గట్టిగా గోల చేస్తే, పవన్ పేరు చెప్పకుండా మైక్ తీసుకుని “జై” అని గట్టిగా చెప్పేసి తప్పుకున్నాడు.
ఇక బయటి హీరోలు, బయటి సినిమాల సంగతే ఇలా ఉంటే మెగా హీరోల సినిమాల ఫంక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవి పవన్ నామస్మరణ తో నిండిపోతున్నాయి. ఏది ఏమైనా, ఒక్కొక్కరికీ వాళ్ళ లైఫ్ లో ఒక పీక్ టైం నడుస్తుంది. మరి పవన్ కి కూడా ఇప్పుడు అలాంటి టైమే నడుస్తోంది. అయితే ఇదే పవన్ కి పీక్ టైమా లేక మరింత పీక్ టైమా లేక మరింత పీక్ పొజిషన్ వ్రాసి పెట్టి ఉందా అనేది భవిష్యత్తులోనే తెలుస్తుంది.