వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే నటీ కస్తూరి మరోసారి వివాదాల్లోకి వచ్చారు. 300 ఏళ్ల క్రితం ఓ తమిళ రాజు అంతఃపురంలో రాణులకు సేవ చేయడానికి తెలుగువారు తమిళనాడుకు వచ్చారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా జరిగిన ఓ పొలిటికల్ ఈవెంట్ లో కరుణానిధి ఫ్యామిలీని టార్గెట్ చేసిన మాట్లాడిన ఆమె.. అంతఃపురంలో రాణులకు సేవ చేయడానికి తెలుగువారు ఇక్కడికి వచ్చారని చెప్పడం తీవ్ర కలకలం రేపుతోంది.
కస్తూరి వాఖ్యలపై నాయకులు, తెలుగు సంఘాలు, ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రతి విషయాన్ని వివాదంగా మార్చే కస్తూరి .. ఇప్పుడు తెలుగు వారిని ఉద్దేశించిన చేసిన వాఖ్యలు హేయమని, కస్తూరి ఓ చరిత్రహీనురాలని విమర్శించారు. కస్తూరి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాగ ఈ విషయంలో కస్తూరి క్లారిటీ ఇచ్చారు. ‘తెలుగు వారంతా నా కుటుంబం. నా కామెంట్స్‌ను డీఎంకే పార్టీ నా కామెంట్స్‌ను వక్రీకరిస్తోంది. ఇలా నాపై నెగెటివిటీ తీసుకొచ్చి నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తోంది. నేను తెలుగు వారికి వ్యతిరేకంగా మాట్లాడానంటూ విష ప్రచారం చేస్తోంది’ అని వివరణ ఇచ్చారు. దీనిపై ఆమె సాయంత్రం ఓ ప్రెస్ మీట్ కూడా పెడుతున్నారు.