శుభలగ్నం, మావి చిగురు లాంటి చిత్రాల్లో.. ఉత్తమ నటన కనబరచి, అందరి హృదయాల్నీ గెలుచుకున్న నటి ఆమని. ఇప్పుడు అమ్మ పాత్రల్లోనూ.. రాణిస్తోంది. ఇటీవల ఆమని నటించిన `అమ్మ దీవెన` విడుదలైంది.రెండ్రోజుల నుంచీ ఆమని ఆరోగ్యానికి సంబంధించి కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి, ఆమనికి హార్ట్ ఎటాక్ వచ్చిందని, ఆసుపత్రిలో చేరిందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందన్నది ఆ వార్తల సారాంశం. దీనిపై ఆమని స్పందిచారు.
”రెండ్రోజులుగా నా ఆరోగ్యంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. అవన్నీ పుకార్లు మాత్రమే. వాటిని నమ్మకండి. ఓ షూటింగ్ లో నాకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. నాకే కాదు.. యూనిట్ అందరూ ఫుడ్ పాయిజన్ తో బాధ పడ్డారు. ఇప్పుడు ఆరోగ్యం కుదురుగా ఉంది. అంతే తప్ప… హార్ట్ ఎటాక్ కాదు…” అని ఓ వీడియో సందేశంలో క్లారిటీ ఇచ్చారామె.