తెలుగు సినీ పరిశ్రమలోకి తుఫానులాగ వచ్చి వెళ్ళిపోయిన నటి గజాల. ఆమె తెలుగులో అనేక సినిమాలు చేసినప్పటికీ ఆమె హీరోయిన్ గా నిలద్రొక్కుకోలేకపోయారు. ‘నాలో ఉన్న ప్రేమ’ అనే సినిమాతో 2011లో తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన గజాలా ఆ తరువాత జూ.ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్:1, ఓ చిన్నదాన, కలుసుకోవాలని, అదృష్టం, అల్లరి రాముడు, భరత సింహా రెడ్డి, తొట్టి గ్యాంగ్, జానకి వెడ్స్ శ్రీ రామ్, మల్లీశ్వరి, నువ్వంటే నాకిష్టం, భద్రాద్రి, రాంబాబుగాడి పెళ్ళాం, మొదలయిన 17 చిత్రాలలో నటించింది. అలాగే తమిళ్, మలయాళం, కన్నడ చిత్రాలలో కూడా నటించింది. కానీ ఆమె అదృష్టం కలిసిరాలేదు. 2011లో నటించిన ‘మనీ మనీ మోర్ మనీ’ తరువాత ఆమెకు అసలు అవకాశాలు రాలేదు. ఇంకా ఎంత కాలం ఎదురుచూపులు చూసినా ప్రయోజనం ఉండదని భావించడంతో ముంబైలోని టీవీ ఆరిస్ట్ ఫైజల్ ఖాన్ అనే వ్యక్తిని ఈరోజు వివాహం చేసుకోబోతున్నారు. ముంబైలోని ఒక ప్రముఖ హోటల్లో ఈ రోజు జరుగబోతున్న ఆమె వివాహానికి కొందరు బందుమిత్రులను మాత్రమే ఆహ్వానించారు.